తుంగతుర్తి : మండలంలోని సింగారం తండ గ్రామన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పైలట్ గ్రామంగా గుర్తించి రెండు నెలలు అవుతున్నా ఒక్క రేషన్ కార్డు కూడా ఇంతవరకు ఇవ్వలేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో కలిసి ఎండిపోయిన పొలాలలో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కరువు అని ఆరోపించారు.
ఎండిపోయిన పొలాలకు నీరందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మహిళలకు, వృద్ధులకు, నిరుద్యోగులకు ఉద్యోగులకు, కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క మాటను కూడా ప్రభుత్వం అమలు చేయక పోను అడిగిన ప్రతిపక్ష ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పద్మ, స్థానిక నాయకులు చెన్ను నాయక్, నాగు నాయక్, రమేష్ నాయక్, గోపగాని వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.