పెన్ పహాడ్ జూన్ 08 : దాదాపు 32 సంవత్సరాల తర్వాత తమ స్నేహితులు, చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ సందడిగా గడిపారు. పెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-1992 సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమేళనం కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన తమ పూర్వ విద్యార్థులను చూసి గురువులు ఆనందించారు.
జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు.
తమపై విద్యార్థుల ప్రేమాభినాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నారు. విద్యార్థులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్ధి దశలో గురువులతో మెలిగిన సందర్భాలను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గురువులు వెంకట్ రెడ్డి, వీరయ్య, మల్గి రెడ్డి రాఘవ రెడ్డి, నారాయణ, మల్లరెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బైరెడ్డి భద్రా రెడ్డి, పల్లెపంగు మదన్, కోటిరెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. శాలువతో ఘనంగా సన్మానించారు.