బుధవారం 03 మార్చి 2021
Suryapet - Jan 16, 2021 , 00:58:05

వ్యాక్సినేషన్‌ విజయవంతం చేయాలి

వ్యాక్సినేషన్‌ విజయవంతం చేయాలి

  • అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి   
  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
  • సూర్యాపేట కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష    
  • జనరల్‌ దవాఖానలో ప్రారంభించనున్న మంత్రి 

సూర్యాపేట టౌన్‌, జనవరి 15 : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యాక్సినేషన్‌ సన్నాహక సమావేశంలో పాల్గొని కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాధాన్యతా క్రమంలో టీకా అందించాలని వైద్యాధికారిని ఆదేశించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. టీకా వందశాతం సురక్షితమైనదని, టీకా వేసుకున్న తర్వాత ఏమైనా ఇబ్బందులు జ్వరం, దద్దుర్లు లాంటివి వస్తే వెంటనే వైద్యం అందించేందుకు వైద్య నిపుణులు, సిబ్బంది సిద్ధంగా ఉంటారని మంత్రి తెలిపారు. కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ విజయవంతం చేయడానికి పక్కా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఇప్పటికే మాక్‌డ్రిల్‌ ద్వారా వైద్యాధికారులు సంబంధిత శాఖల సిబ్బందికి అవగాహన కల్పించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలన్నారు. సమావేశంలో సూర్యాపేట, హుజుర్‌నగర్‌ ఆర్డీఓలు రాజేంద్రకుమార్‌, వెంకారెడ్డి, డీఎస్పీ రమేశ్‌కుమార్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ హర్షవర్ధన్‌, జిల్లా అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

VIDEOS

logo