బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 08, 2020 , 01:05:46

అర్హు లైన వీధివ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలి

అర్హు లైన వీధివ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలి

l  కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

కోదాడ రూరల్‌ : ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకం ద్వారా అర్హులైన వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులు సూచించారు. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీనివాస థియేటర్‌ సమీపంలో ఓ వీధి వ్యాపారిని కలిసి ప్రభుత్వ రుణ మంజూరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ మల్లారెడ్డితో మాట్లాడి రుణ మంజూరులో జాప్యంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోదాడ పట్టణంలో 2,628 మంది లబ్ధిదారులకు రుణాలివ్వాలని లక్ష్యం కాగా   2,642 దరఖాస్తులు అందినట్లు  చెప్పారు. అం దులో 1042 దరఖాస్తులను ఆన్‌లైన్‌ ఆప్‌లోడ్‌ చే యగా 174 మందికి బ్యాంకులు రుణాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా 1600 మంది దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేయాల్సి ఉందని కమిషనర్‌ తెలిపారు. రుణాల మంజూరులో బ్యాంకుల్లో జాప్యం అవుతున్నట్లు ఆయన కలెక్టర్‌కు వివరించారు. రుణాలు మంజూరు చేసేందుకు అధికారులు సహకరించాలని సూచించారు. వీరి వెంట రుణాల కమ్యూనిటీ ఆర్గనైజర్‌ సువర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


logo