గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 03, 2020 , 00:09:07

కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి

కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి

రామన్నపేట : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉద్దీపణ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో తన సొంత డబ్బులతో ఏర్పాటుచేసిన కషాయ వితరణ కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పలువురికి కషాయం అందజేసి మాట్లాడుతూ.. కషాయం తాగడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ వారి నిబంధనల మేరకు కషాయం తయారుచేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి మండలకేంద్రంలో కషాయ వితరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జెల్ల వెంకటేశం, ఎండీ అక్రం, పోతరాజు శంకరయ్య, బత్తుల కృష్ణగౌడ్‌, మోటె నరేశ్‌, కూనూరు కృష్ణగౌడ్‌, ఎండీ నాజర్‌, కోట సుధాకర్‌, గొలుసుల ప్రసాద్‌, సాయి పాల్గొన్నారు.


logo