మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 31, 2020 , 02:13:16

న్యూ లుక్స్‌

న్యూ లుక్స్‌

  • సౌందర్య సాధనాలపై మహిళల ఆసక్తి 
  • గోర్ల నుంచి చెప్పుల వరకు అంతా మ్యాచింగ్‌
  • మార్కెట్‌లోనూ వివిధ కంపెనీల సౌందర్శ సాధనాలు

తిరుమలగిరి :  ఫ్యాషన్‌ మహిళల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చి వేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభించే వివిధ రకాలైన సౌందర్యసాధనాలపై మహిళలు, ముఖ్యంగా యువతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటి ట్రెండ్స్‌కు అనుగుణంగా కొత్త ఐడియాలతో నలుగురిలో తాము మిన్నగా కనిపించేందుకు యత్నిస్తున్నారు. నెయిల్‌పాలిష్‌ మొదలు చెప్పుల వరకు అంతా మ్యాచింగ్‌ ఉండాల్సిదే. అందుకే మార్కెట్లో వారి అభిరుచికి అనుగుణంగా దుకాణాలు వెలిశాయి. 

పూర్వం పండుగలు, వేడుకలకు మహిళలు గోరింటాకు పెట్టుకొని, సంప్రదాయ బద్ధంగా ముస్తాబయ్యేవారు. కాలం మారింది. మహిళల అభిరుచులు, ఆలోచనలూ మారాయి. నయా ట్రెండ్‌కు అనుగుణంగా వెరైటీ బ్యూటీ టిప్స్‌ను ఫాలో అవుతున్నారు. పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లాలంటే ప్రత్యేకంగా తయారయ్యేందుకు అన్ని రకాల సౌందర్య సాధనాలూ లభిస్తున్నాయి. 

గోర్లకు పెయింటింగ్స్‌కోసం డిజైనర్లు

ప్రస్తుతం మగువలు ధరించిన డ్రస్సులకు తగ్గట్టు చేతి, కాలి గోర్లకు పెయింటింగ్‌ వేసుకుంటున్నారు. మహిళలు, యువతులు గోర్లపై పెయింటింగ్‌ వేసేందుకు మార్కెట్‌లో ప్రత్యేక కేంద్రాలు సైతం వెలిశాయి. ఫంక్షన్లకు వెళ్లాలంటే రకరకాల రంగుల్లో నెయిల్‌ పాలిష్‌ వేసుకుంటూ తమ అందాన్ని మరింత పెంచుకుంటున్నారు. ఈ ట్రెండ్‌ ఒకప్పుడు పట్టణాలకే పరిమితమవగా.. నేడు పల్లెలకూ పాకింది. కళాశాలకు వెళ్లే అమ్మాయిలు ఈ ట్రెండ్‌ను బాగా ఫాలో అవుతున్నారు. వివాహాది శుభకార్యాలకు వెళ్లాలంటే చాలు.. వేసుకున్న దుస్తులు, నెయిల్‌ పాలిష్‌ మొదలు వేసుకునే చెప్పుల వరకు ఒకటే కలర్‌లో అంతా మ్యాచింగ్‌ ఉండేలా చూస్తున్నారు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో ఏ ఒక్కటి కొన్నా మ్యాచింగ్‌ అంటూ మిగతా వస్తువులూ అంటగడుతున్నారు వ్యాపారులు. logo