మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 21, 2020 , 23:59:00

కుటుంబానికి అండగా యువతకు స్ఫూర్తిగా..

కుటుంబానికి అండగా  యువతకు స్ఫూర్తిగా..

  • కర్నల్‌ కుటుంబానికి సర్కార్‌ ఆపన్నహస్తం
  • నేడు సంతోష్‌బాబు ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • ప్రభుత్వ సాయాన్ని స్వయంగా  సీఎం
  • ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
  • హర్షం వ్యక్తం చేస్తున్న మాజీ సైనికులు

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ  సరిహద్దులో చైనా సైన్యంతో పోరాడుతూ ధైపాణాలర్పించిన  బిక్కుమళ్ల సంతోష్‌బాబు కుటుంబ సభ్యులను నేడు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించనున్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో    ఇంటికి నేరుగా చేరుకుంటారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికి ఆయన వెంట ఉండనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున సంతోష్‌బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి రూ.ఐదు కోట్ల  గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం, హైదరాబాద్‌లో ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించారు. వీటికి సంబంధించిన అన్ని ఉత్తర్వులను కేసీఆర్‌ నేడు స్వయంగా  కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన వివరాలను తెలిపేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం సంతోష్‌బాబు ఇంటికి వెళ్లారు. కర్నల్‌ భార్య సంతోషి, తల్లిదండ్రులు ఉపేందర్‌, మంజులతో అరగంటకు పైగా మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న సాయానికి వారు  వ్యక్తం చేశారు. దేశం కోసం తన కొడుకు చేసిన త్యాగానికి అత్యున్నత గౌరవాన్ని కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా సంతోష్‌ తండ్రి ఉపేందర్‌ వ్యాఖ్యానించారు. అనంతరం సంతోష్‌బాబు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా ఫోన్‌లో సీఎం కేసీఆర్‌కు వివరించారు.

సంతోష్‌బాబు మరణవార్త తెలిసిన మరుక్షణం నుంచి ప్రభుత్వం వారి కుటుంబానికి మనోధైర్యం నింపేలా అన్ని చర్యలు చేపట్టింది. సంతోష్‌బాబు ప్రాణత్యాగం వెలకట్టలేనిదంటూ సీఎం కేసీఆర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అంత్యక్రియల ప్రక్రియ అయ్యే వరకు ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షించాలని  ఆదేశించారు.  ఆ రాత్రికే జగదీశ్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి సూర్యాపేటకు చేరుకున్నారు. సంతోష్‌బాబు ఇంటికి వెళ్లి వారికి మనోధైర్యం చెప్పారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యుడిలా మంత్రి వారి వెంట ఉండి అన్ని కార్యక్రమాలు సవ్యంగా సాగేలా నడిపించారు. అయితే..ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సైన్యంలో  వారికి ఎంతో మనోధైర్యాన్ని ఇస్తున్నాయి.  సైన్యంలో చేరాలనుకునే  సైతం స్ఫూర్తిని కలిగించేలా ఈ చర్యలు ఉన్నాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

భారీ బందోబస్తు 

సీఎం రాక సందర్భంగా సూర్యాపేటలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  అడిషనల్‌ ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 20 మంది ఇన్‌స్పెక్టర్లు, 50 మంది ఎస్‌ఐలతోపాటు ఏఎస్‌ఐలు, సిబ్బంది 600 మందిని వినియోగించనున్నట్లు ఎస్పీ భాస్కరన్‌ తెలిపారు. ఏర్పాట్లను కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌  సంతోష్‌ ఇంటివద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్‌ నిరంతరం ఉండేలా చూడాలని,  నిర్ధేశించిన సమయానికి చేపట్టాలని  అధికారులను ఆదేశించారు.ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించి, మాస్కులు తప్పకుండా ఉపయోగించాలన్నారు.  వారిలో డీఆర్‌ఓ మోహన్‌రావు, డీఎస్పీ మోహన్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రామానుజులరెడ్డి ఉన్నారు.logo