శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 12, 2020 , 03:39:42

పేదలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

పేదలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ : రాష్ట్రంలో నిరుపేదల అభివృద్ధి కోసం  సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని  ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని శ్రీ ఫంక్షన్‌హాల్లో మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని 218మందికి  కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు రూ.2 కోట్ల 14లక్షల 51వేల 171లను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలనచేస్తూ అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం కేసీఆర్‌ పాలన స్వర్ణయుగం లాంటిదన్నారు. ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా అండగా నిలుస్తున్నారన్నారు. మిషన్‌కాకతీయ ద్వారా చెరువులు పుర్నిర్మాణం చేసి రైతులకు, కూలీలకు ఎనలేని మేలు చేశారని తెలిపారు. మిషన్‌ భగీరద పథకం ద్వారా  ఇంటింటికి తాగునీరు అందిస్తున్నారన్నారు. ప్రజాసంక్షేమం కోసం కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికి అందరు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రోహిత్‌సింగ్‌, తాసిల్దార్‌ గణేష్‌, జడ్‌పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కుర్ర కోటేశ్వర్‌రావు, ఎంపీపీ నూకల సరళహనుమంతరెడ్డి, వైస్‌ఎంపీపీ అమరావతి సైదులు, పాశం నర్సింహ్మారెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, ఖాదర్‌, ఉదయ్‌భాస్కర్‌, కర్నె గోవిందరెడ్డి ఉన్నారు.logo