బుధవారం 03 జూన్ 2020
Suryapet - Jan 22, 2020 , 04:39:28

నేడే ‘పుర’ పోలింగ్

 నేడే ‘పుర’ పోలింగ్


సూర్యాపేట జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్ తిరుమలగిరి, నేరేడుచర్ల పురపాలికల్లో నేడు జరిగే పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 339 పోలింగ్ కేంద్రాలు ఉండగా సూర్యాపేటలో 148, కోదాడ 75, హుజూర్ 56, నేరేడుచర్ల 30, తిరుమలగిరిలో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐదు మున్సిపాలిటీలు కలిపి 140 వార్డులు ఉండగా ఎన్నికల నిర్వహణ కోసం 39రూట్లు ఏర్పాటు చేశారు. వీటికిగాను 36మంది జోనల్ అధికారులు, 39మంది రూట్ అధికారులు, 48చొప్పున రిటర్నిగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. 339 మంది ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతోపాటు 1017మంది పోలింగ్ క్లర్కులను నియమించారు. అలాగే 41మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల సంఖ్యను బట్టి బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేశారు. అత్యవసరం పడితే ఉపయోగించుకునేలా అదనపు ఏర్పాట్లు చేశారు.  ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

భారీ బందోబస్తు

ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో 144సెక్షన్ విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం నలుగురు డీఎస్పీలు, 14మంది సీఐలు, 52మంది ఎస్ 156 మంది ఏఎస్ హెడ్ 640మంది కానిస్టేబుళ్లు, 256మంది హోంగార్డులు, ఇతర జిల్లాల నుంచి మరో 200మంది పోలీస్ సిబ్బంది కలిపి 1500మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.logo