e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home News గ్లామర్‌ రంగంలో అందరి సంగతేమో కానీ.. నా విషయంలో జరిగింది ఇదే

గ్లామర్‌ రంగంలో అందరి సంగతేమో కానీ.. నా విషయంలో జరిగింది ఇదే

ఆమె కండ్లలో పల్లెదనపు అమాయకత్వం అప్రయత్నంగా తొంగిచూస్తుంది. ఆమె మాటల్లో తెలంగాణ యాస పల్లవిస్తుంది.‘మల్లేశం’ సినిమాతో పరిచయమై ‘ప్లేబ్యాక్‌’తో మరింత దగ్గరైంది అనన్య నాగళ్ల. ‘వకీల్‌ సాబ్‌’తో మరో విజయాన్ని అందుకుని, వెండితెరపై తళుక్కుమంటున్న ఈ తెలంగాణ అమ్మాయి జర్నీ ఆమె మాటల్లోనే..

గ్లామర్‌ రంగంలో అందరి సంగతేమో కానీ..  నా విషయంలో జరిగింది ఇదే

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలన్నది నా లక్ష్యం. నా కోసం కష్టపడుతున్న అమ్మను సంతోష పెట్టాలని ఇష్టపడి చదివాను. అనుకున్నట్టుగానే ఇన్ఫోసిస్‌లో ఉద్యోగంలో చేరాను. కానీ, అనుకోకుండా నా అడుగులు సినిమాలవైపు పడ్డాయి. ఏదో సాధించాలన్న తపనే నన్ను వెండితెరకు దగ్గర చేసింది. మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. పక్కా వ్యవసాయ కుటుంబం. నాన్న వెంకటేశ్వరరావు. నా చిన్నతనంలోనే ఆయన పోయారు. అమ్మ విష్ణుప్రియ. నాకో అన్నయ్య ఉన్నాడు. మా చదువులకోసం అమ్మ హైదరాబాద్‌కు వచ్చేసింది. టెన్త్‌, ఇంటర్‌ ఇక్కడే చదివా. అన్న, అమ్మ ప్రోత్సాహంతో బీటెక్‌ చదివాను. వెంటనే ఇన్ఫోసిస్‌ సంస్థలో ఉద్యోగం వచ్చింది. అనుకున్న లక్ష్యం సాధించాననే తృప్తి సంతోషాన్నిచ్చింది.

గ్లామర్‌ రంగంలో అందరి సంగతేమో కానీ..  నా విషయంలో జరిగింది ఇదే

మలుపు తిప్పిన ‘షాదీ’

- Advertisement -

బాల్యం నుంచీ అంతే. జీవితంలో ఏదో చేయాలన్న తపన నన్ను వెంటాడేది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే వీకెండ్స్‌లో లా కోర్సులో చేరాను. న్యాయశాస్త్ర పట్టా అందుకున్నా. అక్కడితో ఆగిపోవాలనుకోలేదు. నాకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాలని ఉండేది. ఆ సమయంలోనే ‘షాదీ’అనే షార్ట్‌ఫిల్మ్‌ నా ప్రయాణాన్ని మలుపు తిప్పింది. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో స్నేహితుల ప్రోత్సాహంతో అందులో నటించాను. అప్పటి వరకు నటనంటే ఏంటో నాకు తెలియదు. దాన్ని నిర్మించింది కూడా స్నేహితులే కావడంతో, ధైర్యంగా నాకు వచ్చింది చేశాను. చిట్టి చిత్రమే అయినా మంచి కంటెంట్‌ ఉండటంతో, నా యాక్టింగ్‌ బాగా ఎలివేట్‌ అయింది. తర్వాత సామాజిక స్ఫూర్తినిచ్చే కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించాను. క్రమంగా నటనపై ఆసక్తి పెరిగింది. యాక్టింగ్‌ నేర్చుకోవడానికి ఓ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. ఆ పాఠాలు బాగా ఉపయోగపడ్డాయి.

గ్లామర్‌ రంగంలో అందరి సంగతేమో కానీ..  నా విషయంలో జరిగింది ఇదే

శిక్షణలో ఉండగానే..

ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే ‘మల్లేశం’ హీరోయిన్‌ ఎంపిక కోసం చిత్ర బృందం మా ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చింది. అందరితోపాటు ఆడిషన్స్‌లో పాల్గొన్నా. ‘మనకంత సీన్‌ లేదులే!’ అనుకున్నా. విడతల వారీగా ఆడిషన్స్‌ నిర్వహించి, చివరకు నన్ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కొద్ది రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి సినిమాలో నటించాను. ఆ చిత్రానికి మంచి గుర్తింపు వచ్చింది. ‘అనన్య మంచి నటి’ అన్న పేరూ వచ్చింది. ‘మల్లేశం’ తర్వాత అనేక అవకాశాలు పలుకరించాయి. దీంతో ఉద్యోగానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేశాను. ‘ప్లే బ్యాక్‌’తోపాటు నేను చేసిన మరోరెండు చిత్రాలు కూడా వైవిధ్యమైనవే.

గ్లామర్‌ రంగంలో అందరి సంగతేమో కానీ..  నా విషయంలో జరిగింది ఇదే

‘మల్లేశం’ సినిమా తర్వాత మరిన్ని సినిమా అవకాశాలు తలుపుతట్టాయి. దర్శకుడు శ్రీరామ్‌ వేణు కూడా ‘మల్లేశం’ చూశాకే, ‘వకీల్‌సాబ్‌’లో ఓ క్యారెక్టర్‌ కోసం నన్ను అనుకున్నారట. అయితే, రెండు మూడు ఆడిషన్స్‌ తర్వాత గానీ కన్‌ఫర్మ్‌ చేయలేదు. ఇప్పుడు నటన నా వృత్తి. దీనికి నూటికి నూరుశాతం న్యాయం చేయాలి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. నా వరకు నేను కథ నచ్చితే చాలు, నటించడానికి సిద్ధం. హద్దులేం పెట్టుకోలేదు. ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు వస్తుందని నా మనసుకు అనిపిస్తే చాలు.

గ్లామర్‌ రంగంలో అందరి సంగతేమో కానీ..  నా విషయంలో జరిగింది ఇదే
అనన్య నాగళ్ల

అదృష్టం కూడా తోడైతే..

నేను గొప్ప నటినని అనుకోవడం లేదు. నేను పోషించే పాత్రకు ఎలా ఉండాలో అలానే ఉండటానికి ప్రయత్నిస్తా. దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా నటించడం అలవాటు చేసుకున్నా. ‘మల్లేశం, ప్లే బ్యాక్‌ చిత్రాల తర్వాత నా కెరీర్‌ సరైన దారిలోనే వెళ్తున్నది కదా!’ అని ఒక నిమిషం ఆలోచించా. ఎవరికైనా ప్రతిభతోపాటు అదృష్టం తోడైతేనే తగిన అవకాశాలు వస్తాయి. వరుసగా మూడు సినిమాలు నటిగా నాకు గుర్తింపును తెచ్చాయి. మరికొన్ని షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ముందు.. అనన్య ఉందంటే వెళ్లి సినిమా చూడొచ్చని ప్రేక్షకులకు నమ్మకం కలిగే చిత్రాలు చేస్తాను. అభిమానులకూ ఆత్మీయులకూ ఇది నా భరోసా.

గ్లామర్‌ రంగంలో అందరి సంగతేమో కానీ..  నా విషయంలో జరిగింది ఇదే

పవర్‌ స్టార్‌తో..

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ను కలవడమే అదృష్టంగా భావించేదాన్ని. అటువంటిది ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయం. ఆ సినిమా షూటింగ్‌ పూర్తయ్యే వరకు అంతా కలలా అనిపించేది. 2017లో పింక్‌ చూశాను. దాని రీమేక్‌లో నటిస్తానని ఊహించలేదు. ఇది వవన్‌కల్యాణ్‌ సినిమా అని నాకు ముందు తెలియదు. తెలిశాక సర్‌ప్రైజ్‌ అయ్యాను. మహిళా ప్రేక్షకుల ఆదరణతో కమర్షియల్‌ సక్సెస్‌ సాధించిన సినిమా ఇది. మొదట్లో భయంగా ఉండేది. పవన్‌ కల్యాణ్‌తో దూరంగా ఉండేదాన్ని. కోర్టు సీన్స్‌ షూట్‌ అప్పుడు మాత్రం కొద్దిగా పరిచయం కలిగింది. ‘నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చదివాను, ఏ సినిమాలు చేస్తున్నాను?’ వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో నటించడం కంఫర్టబుల్‌గా అనిపించింది.

గ్లామర్‌ రంగంలో అందరి సంగతేమో కానీ..  నా విషయంలో జరిగింది ఇదే

నేనే ఉదాహరణ

ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు కూడా చాన్సులు వస్తాయనడానికి నేనే ఉదాహరణ. నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. మొదట్లో నటిని అవుతానన్న ఆలోచన కూడా లేదు నాకు. ఇప్పుడు ఆర్టిస్ట్‌గా చాలా హ్యాపీగా ఉన్నా. షార్ట్‌ఫిల్మ్‌తో మొదలుపెట్టి పెద్ద సినిమాల్లోనూ అవకాశాలు పొందుతున్నా. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలకు అవకాశం రావడం కొంత సులభమే! కానీ, దొరికిన ప్రతి అవకాశాన్ని నిలబెట్టుకోవడం ఎవరికైనా కష్టమే! అలాగే, గ్లామర్‌ రంగంలో అమ్మాయిలకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయని నేనూ విన్నాను. కానీ, నాకెప్పుడూ అలాంటి సందర్భాలు ఎదురు కాలేదు.

-వరకవుల దుర్వాసరాజు

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Tollywood : అంద‌రి దృష్టి టాలీవుడ్‌పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇత‌ర భాష‌ల హీరోలు

సీక్రెట్‌ ఏజెంట్స్‌గా మారిపోతున్న టాలీవుడ్ హీరోలు

రాజ‌మౌళి చ‌దివింది ఇంట‌రే.. మ‌రి త్రివిక్ర‌మ్‌, క్రిష్‌, సుకుమార్ ఏం చ‌దివారో తెలుసా?

పీల‌గా క‌నిపిస్తున్న రకుల్‌.. సెటైర్స్ వేస్తున్న నెటిజ‌న్స్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గ్లామర్‌ రంగంలో అందరి సంగతేమో కానీ..  నా విషయంలో జరిగింది ఇదే
గ్లామర్‌ రంగంలో అందరి సంగతేమో కానీ..  నా విషయంలో జరిగింది ఇదే
గ్లామర్‌ రంగంలో అందరి సంగతేమో కానీ..  నా విషయంలో జరిగింది ఇదే

ట్రెండింగ్‌

Advertisement