CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) శ్రేణులకు ఆ పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీని స్థాపించామని తెలిపిన టీవీకే, ప్రజలు ఇబ్బంది పడే పనులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి ఎన్. ఆనంద్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. నాయకుల పుట్టినరోజులు లేదా కుటుంబ వేడుకల సందర్భాల్లో వీధులు, బహిరంగ ప్రదేశాలు, జనసముహాం ఉన్న చోట లేదా ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా ఎలాంటి బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని పార్టీ కార్యకర్తలను ఆదేశించింది.
అంతేగాకుండా.. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఎలాంటి వేడుకలు జరపకూడదని, ఒకవేళ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయించినట్లు పార్టీ ప్రకటించింది. ప్రజలు మనపై ఎంతో నమ్మకం ఉంచారని, ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కార్యకర్తలకు సూచించింది. తమిళనాడు అభివృద్ధి కోసం పయనిస్తున్న తరుణంలో, ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని ఈ ప్రకటన ద్వారా టీవీకే గట్టి హెచ్చరిక జారీ చేసింది.
தலைமை நிலையச் செயலக அறிவிப்பு
கழகத் தோழர்கள் அனைவருக்கும் வணக்கம்.
தமிழ்நாட்டு மக்களின் நலன் ஒன்றையே குறிக்கோளாகக் கொண்டு தொடங்கப்பட்டதுதான் தமிழக வெற்றிக் கழகம். தமிழ்நாட்டு மக்களின் ஏகோபித்த நம்பிக்கையைப் பெற்ற, தமிழ்ச் சொந்தங்களின் குடும்பத்தில் ஒருவராக இருக்கக்கூடிய…
— TVK Party HQ (@TVKPartyHQ) May 12, 2026