టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు పొందిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలోను నటిస్తుంది. అయితే ఈ అమ్మడు ఇటీవల భారీగా వర్కవుట్స్ చేస్తూ పీలగా మారుతుంది. ఆమెపై ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినా కూడా రకుల్ మాత్రం నిత్యం వ్యాయామాలు చేస్తూ జీరో సైజ్‌లోకి మారుతుంది.
రకుల్ తాజాగా ఫొటో షూట్ చేయగా, అందుకు సంబంధించిన ఫొటోలని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో రకుల్ మొహంతో పాటు ఆమె శరీరాకృతి వింతగా కనిపిస్తుంది. దీంతో నెటిజన్స్ ఓ ఆటాడుకుంటున్నారు. వెరైటీ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల తెలుగులో రకుల్ పని అయిపోయింది అంటూ కథనాలు రాగా, దానిపై రకుల్ సెటైరికల్‌గా స్పందించింది. ఏడాదిలో ఆరు చిత్రాలు చేస్తున్నా ఇంకా డేట్స్ అడ్జస్ట్ చేసే టీం ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి అని కౌంటర్ వేశారు. డేట్స్ అడ్జస్ట్ కాలేకపోవడంతోనే తెలుగులో ప్రాజెక్ట్‌లను ఒప్పుకోవడం లేదని రకుల్ చెప్పకనే చెప్పేశారు.