ఇంట్లో పెద్దవాళ్లో.. చంటి పిల్లలో ఉంటే తగిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకుంటాం. వాటిలో కెమెరా నిఘా ఒకటి. ఎందుకంటే.. మనం ఏం చేస్తున్నా వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాల్సిందే. అంతేకాదు.. ఇళ్లలో ఇప్పుడు రక్షణ కెమెరాల్ని అమర్చుకోవడం అనివార్యంగా మారింది. అందుకే ఇంటి రక్షణ కోసం.. ట్రూ వ్యూ క్యూబ్ కాంపాక్ట్ ఇండోర్ వైర్లెస్ సెక్యూరిటీ కెమెరాని వాడొచ్చు.
ఈ కెమెరా 1080 పీ హెచ్డీ గ్రేడ్‌లో స్పష్టమైన వీడియోలు తీస్తుంది. 4ఎంఎం ఫిక్స్డ్ లెన్స్‌తో వీడియోలను క్లియర్‌గా చూపిస్తుంది. టూ-వే ఆడియోతో ఇంట్లో ఉన్న వారితో మాట్లాడొచ్చు. హై-సెన్సిటివ్ మైక్, స్పీకర్‌తో ఈ కెమెరా పనిచేస్తుంది. మోషన్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. కస్టమర్ వాయిస్ రికార్డింగ్‌తో అలర్ట్స్ సెట్ చేసుకోవచ్చు. 256 జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డ్‌తో స్టోరేజ్ సదుపాయం ఉంది. క్లౌడ్ స్టోరేజ్ కూడా ఆప్షనల్‌గా సపోర్ట్ చేస్తుంది. సెటప్ చాలా ఈజీ! వైఫైలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నిమిషాల్లో సెట్ చేయొచ్చు.
అలెక్సా సపోర్ట్ కూడా ఉంది.
ధర: రూ. 999
దొరుకు చోటు: అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లు