సంస్కృతి అంటే ఒక జాతి సమగ్ర జీవనవిధానం. సమాజంలోని మానవులు నేర్చుకొన్న, అలవరచుకొన్న నమ్మకాలు, ఆచారాలు, అలవాట్లు, నీతుల కలబోతే సంస్కృతి. యుగయుగాలుగా ఎడతెగక ప్రవహిస్తున్న ప్రవాహమే హైందవ సంస్కృతి. ఇందులోనుంచి వచ్చినవే సంప్రదాయాలు, ఆచారాలు. వీటికి మన పండుగలు ముఖ్య కేంద్రాలు. ప్రతీ పండుగ వెనుక ఒక శాస్త్రీయత, సంప్రదాయం, వైజ్ఞానికత దాగి ఉన్నాయి.
మన సనాతన హైందవ జీవన వ్యవస్థను సర్వోన్నతంగా రూపొందించడానికి రుషులు అద్భుతంగా కృషి చేశారు. వైజ్ఞానికతలేని సంప్రదాయాలు, ఆచారాలు మన సంస్కృతిలో కనిపించవు. ఉదాహరణకు ఉగాది పండుగలో జరుపుకొనేవన్నీ వైజ్ఞానికమైనవే. ముఖ్యంగా ఉగాదిపచ్చడి. ఇది ఆరురుచుల కలయిక. మానవ జీవితం అన్ని రుచుల కలబోతగా ఉంటుంది. ఇలా మన ప్రతి పండుగలోనూ ఓ శాస్త్రీయత కనిపిస్తుంది. మన సంస్కృతిలో పండుగలతోపాటు ఉపవాసాలు కూడా ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
శరీరంలోని అనారోగ్య లక్షణాల నుంచి మానవుని బయటపడవేస్తుంది ఈ ఉపవాసం. ఇలా మన ప్రతి పండుగలో, ఆచారంలో, ఆలయాల్లో వైజ్ఞానికత గోచరం అవుతుంది. ఈ విషయాలన్నిటినీ క్లుప్తంగా, సరళమైన భాషలో ‘హైందవ సంస్కృతి- వైజ్ఞానికత’ గ్రంథం రూపంలో అందించారు రచయిత డాక్టర్ కప్పగంతు రామకృష్ణ. ఈ చిరు కరదీపిక హైందవ సంస్కృతీ, సంప్రదాయాలకు దివిటి అని చెప్పవచ్చు. సనాతన ధర్మాన్ని కాపాడటానికి అహరహం శ్రమిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ గ్రంథాన్ని ముద్రించడం ముదావహం.
రచయిత: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
పేజీలు: 49, వెల: రూ. 25
ప్రతులకు: తిరుమల తిరుపతి దేవస్థానం పుస్తక విక్రయ కేంద్రాలు
రచన: విహారి (జేఎస్ మూర్తి)
పేజీలు: 152;
ధర: రూ. 200
ప్రతులకు: విహారి, సుధామ
ఫోన్: 98480 25600, 98492 97958
రచన: కోటిపల్లి సుబ్బారావు
పేజీలు: 270;
ధర: రూ. 500
ప్రతులకు: తెలుగు బుక్ హౌజ్
ఫోన్: 92474 46497
రచన: ఏటూరి నాగేంద్రరావు
పేజీలు: 107;
ధర: రూ. 100
ప్రతులకు: ఏ. నాగేంద్రరావు
ఫోన్: 74166 65323