తెలంగాణలో వ్యవసాయం ఒకప్పుడు చెరువులు ప్రధానంగా సాగేది. చెరువు నీళ్లు ఆయకట్టు పొలాలకు సరిగ్గా పారేలా చూడటానికి ప్రత్యేకంగా ఓ ఉద్యోగి ఉండేవాడు. అతణ్ని నీరడి అని పిలిచేవారు. సాగుబడికి నీళ్లు సమానంగా పంపిణీ అయ్యేలా చూసేవాడు కాబట్టి నీరడి అందరికీ కావలసినవాడు. గ్రామ పొలాల్లో ఇతనికీ కొంత మాన్యం ఉండేది. అదే నీరడి మడి.
దీని నేపథ్యంలో కూతురు రాంరెడ్డి రాసిన కథ ‘నీరడి మడి’. పెద్ద చదువులు చదువుకుని ఉన్నత ఉద్యోగంలో ఉన్నప్పటికీ వారసత్వంగా వచ్చిన నీరడి మడిని దక్కించుకోవడానికి ఓ వ్యక్తి పడిన తపన ఈ కథ. ఇక ఈ ‘నీరడి మడి’ సంకలనంలో మరో పదమూడు కథలు ఉన్నాయి. ఇవన్నీ సమకాలీన తెలంగాణను ప్రతిబింబించేవే. ఆరోగ్యాన్ని వ్యాపారం చేసిన ఆసుపత్రుల ఇతివృత్తంగా ‘పెద్దాసుపత్రి’ కథ సాగుతుంది. ఇక ‘డాలర్ మోజు’ కథ విదేశీ ప్రయాణం ఒక్కోసారి ఎండమావిని తలపిస్తుందనే సందేశం ఇస్తుంది.
కరోనా లాక్డౌన్ను మనిషిలో మంచి మార్పు సాధనకు ఓ అవకాశంగా ‘అంతా మనమంచికే’ కథ చిత్రించింది. మరో కథ ‘చింత’ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రకృతిలో సృష్టిస్తున్న కల్లోలాన్ని కండ్లకు కడుతుంది. ఇలా ‘నీరడి మడి’లోని కథలు వర్తమాన తెలంగాణ గ్రామీణ సమాజం చుట్టూ అల్లుకుని ఉంటాయి. చదివే వారికి ఇక్కడి సమాజంలో వస్తున్న మార్పులు అవగతం అవుతాయి.
రచన: కూతురు రాంరెడ్డి
పేజీలు: 191; ధర: రూ. 175
ప్రతులకు: ప్రముఖ పుస్తకాల దుకాణాలు
ఫోన్: 90004 15353
రచన: సుతీక్షణ సూర్య రుషి
ధర: రూ. 575 ప్రచురణ: బ్లూరోజ్ ఒన్
ప్రతులకు: WWW.BlueRose One.com
రచన: డా.గండ్ర లక్ష్మణ రావు
పేజీలు: 144; ధర: రూ. 120
ప్రచురణ: సంవేద్య ప్రచురణలు
ఫోన్: 98493 28036
రచన: డా.పి.ఎస్.గోపాల కృష్ణ
పేజీలు: 240; ధర: రూ. 500
ప్రచురణ: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 98490 23852