స్మార్ట్‌వాచీల్లో రోజుకో మోడల్ వస్తున్నది. ఈ క్రమంలోనే భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తూ.. ‘స్విస్ మిలిటరీ ఆడియో’ సంస్థ సరికొత్త రగ్గ్డ్ వాచీని తయారుచేసింది. ‘వేగా’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. చెమటలు కక్కుతూ ట్రెక్కింగ్ చేసే సాహసికుల కోసం.. ఐపీ67 వాటర్‌ప్రూఫ్ టెక్నాలజీని ఇందులో వాడింది.
368*448 పిక్సెల్స్ 1.32 అంగుళాల ఎమోలెడ్ డిస్ప్లే.. పట్టపగలు కూడా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇందులోని ఫిట్ క్లౌడ్ ప్రొ యాప్.. వ్యాయామం, ఫిట్నెస్ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. 260 ఎంఏహెచ్ బ్యాటరీతో రోజంతా నడుస్తుంది. ఏడాది వారంటీతో వస్తున్న ‘వేగా’ ధర రూ.4,490. swissmilitaryaudio.comలో కొనుగోలు చేయవచ్చు.