ఒక విలక్షణమైన కథావస్తువును తీసుకుని చక్కని నవలగా రూపొందించి విడుదల చేశారు ప్రసిద్ధ రచయిత సింహప్రసాద్. చట్టాల్ని తుంగలో తొక్కి, తను చెప్పిందే వేదం అన్నట్లుగా ఒక గ్రామాన్ని నియంతలా శాసిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న సర్పంచ్ ఒకపక్క- సివిల్స్‌కు సిద్ధమవుతున్న యువతి సాత్విక ఒక పక్క ఈ నవలలో కనబడతారు. ఊరిలోని మగాళ్లందరికీ తాగుడు, జూదం అలవాటు చేసి వారందరినీ నిరుపేదలుగా చేసి బలవంతంగా ఆస్తులు దోచుకునే దుర్మార్గుడు సర్పంచ్. తన కుటిల యత్నాలకు అడ్డువచ్చిన వారిని సునాయాసంగా పక్కకు తప్పించే శక్తియుక్తులు కలవాడు.
అలా ఎదురు వెళ్లి సాత్విక తండ్రి అన్యాయంగా బలవుతాడు. అది తెలుసుకుని హైదరాబాద్‌లో చదువుకుంటున్న సాత్విక ఆ ఊరికి వచ్చి, ఊరిలోని యువతను, మహిళలను చైతన్యపరచి సర్పంచ్‌కు ఎదురు నిలబడుతుంది. దీనికి ఆమె ఎంచుకున్న మార్గం చాలా విచిత్రమైనది. అది వేరే ఏదో కాదు మేధోశక్తికి మరో పేరుగా చెప్పుకునే చదరంగం! చదరంగం బోర్డుతో సర్పంచ్ ఆట ఎలా కట్టించిందనేది అక్షరాక్షరంలో ఉద్విగ్నత దట్టిస్తూ రచయిత మనల్ని అక్షరాల వెంట పరుగులు తీయిస్తారు. ఈ సందర్భంగా అవసరమైన చోట్ల ఎన్నో సరికొత్త విషయాలను రచయిత తెలియపరచడం నవలకు మరింత సమగ్రతను తెచ్చింది. అందరూ చదవాల్సిన నవల.
రచయిత: సింహ ప్రసాద్
పేజీలు: 134, వెల: రూ. 129
ప్రతులకు: తపస్వి మనోహరం పబ్లికేషన్స్ కొండాపూర్, హైదరాబాద్
ఫోన్: 78934 67516
-చంద్ర ప్రతాప్ కంతేటి
రచన : ఆచార్య అనుమాండ్ల భూమయ్య
పేజీలు : 103;
ధర : రూ.100
ప్రచురణ : మనస్వినీ దేవి
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 88970 73999
రచన : డా. లక్ష్మీ రాఘవ
పేజీలు : 176;
ధర : రూ.150
ప్రచురణ : జె.వి. పబ్లికేషన్స్
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 94401 24700