నవరసాల్లో శృంగారం మొదటిది. అది ఎంత పండితే జీవితానికి అంత పండుగ. అందుకే ప్రబంధ సాహిత్యంలో సింహభాగం ‘సరసం’గా సాగింది. నాటి కావ్యాల్లోనే కాదు, ఆధునిక సాహిత్యంలోనూ శృంగారం బంగారంలా మెరిసిపోయింది. ప్రేమ, ఆప్యాయత, ఆకర్షణ మార్గమేదైనా.. అంతిమ లక్ష్యం శృంగార సాఫల్యతే! అంతటి ప్రాధాన్యం ఉండబట్టే.. రచయితలు తమ తలపుల్లో వలపు వల పన్ని.. మరులుగొలిపే కథలెన్నో ఆవిష్కరిస్తుంటారు. ఊహల రెక్కలకు మోహాల ఈకలు తొడిగి, మొహమాటాల తెరను దాటించి, ఆరాటాల అంతిమ లక్ష్యాన్ని చేరుస్తూ కథకుడు, నవలాకారుడు గంగుల నరసింహారెడ్డి ఏర్పర్చిన ‘అనుభూతి ముద్ర’ ఈ సంకలనం.
చెలిమి కలిమిని చెలియలికట్ట దాటించకుండా.. శృంగార నైషధాన్ని ముచ్చటైన ఔషధ గుళికల్లా అందించారు రచయిత. ఈ మధురానుభూతుల ప్రవాహంలో అనుభవాల అలలు తెరలు తెరలుగా గుండె పొరలను తడతాయి. ఎంత శృంగారమైనా.. ఔచిత్యాన్ని కోల్పోయిన స్త్రీ పాత్ర కనిపించదు. అందానికి, ఆపై ముచ్చటకు వెంపర్లాడే పురుష పాత్రలు కొన్ని తారసపడతాయి. అందాన్ని ఆరాధించే నిఖార్సయిన మగాళ్లూ ఉన్నారీ కథల్లో! స్వాతి సపరివార పత్రికలో అచ్చయిన సరసమైన కథల్లో బహుమతి పొందినవి, సాధారణ ప్రచురణకు నోచుకున్నవి గుదిగుచ్చి పదిహేను అందమైన కథలను ఈ సంకలనంలో పొందుపరిచారు రచయిత. కథా గమనంలో, పాత్రల్లో, అవి పలికే సంభాషణల్లో అశ్లీలత తొంగి చూడకపోవడం.. రచయిత ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. సరసమైన కథలే అయినా.. సమస్తం ఉన్నాయిందులో!
రచయిత: గంగుల నరసింహారెడ్డి
పేజీలు: 160, ధర: రూ.200
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు ,90102 84700
సంపాదకుడు : వి.ఎస్. రాఘవాచారి
పేజీలు : 136;
ధర : రూ.125
ప్రచురణ : కళాదీపిక
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 99088 37451
రచన : ఫిజిక్స్ అరుణ్ కుమార్
పేజీలు : 173;
ధర : రూ.220
ప్రచురణ : జె.ఎస్. ప్రచురణలు
ప్రతులకు : రచయిత
ఫోన్ : 93947 49536