చిక్కటి పాలు పొయ్యి మీద పెట్టి, సన్న సెగ రాగానే ఇంత చాయపత్తా వేసి, అందులోనే అల్లమింత వేసి, రెండు యాలకులు దంచి కొట్టి.. రెండు పొంగులు వచ్చేదాకా మరగనిచ్చి, తగినంత చక్కెర వేసి.. మరో పొంగు వచ్చాక.. వడగట్టుకున్న చాయ్ పరిమళం పరవశింపజేస్తుంది. ఇన్ని ప్రత్యేక వస్తువులను కలగలుపుకొన్న చాయ్ గరం గరంగా ఉన్నప్పుడే జుర్రుకోవాలి. అప్పుడే దాని రుచి తెలుస్తుంది. నాలుగు జుర్రులు జుర్రగానే.. తలనొప్పి మాయం అవుతుంది. మనసుకు సాంత్వన కలుగుతుంది. ఈ గరం గరం చాయ్ కథలూ అంతే.. హాట్ హాట్‌గా రచయిత వడ్డించిన ఈ కథలు… లేటు చేయకుండా చదివితేనే థ్రిల్. కథలంటున్నారు.. టీ తాగినంత టైమ్‌లో ఏం చదివేస్తాం అని అనుకుంటున్నారా? చిట్టి కథల స్పెషలిస్ట్‌గా పేరున్న ఆర్సీ కృష్ణస్వామి రాజు వీటిని వేడి వేడిగా అందించారు మరి.
చదవడం ఇలా ప్రారంభించగానే అలా అయిపోయేంత క్లుప్తంగా సాగే కథలివి. అలాగని తాను ఎంచుకున్న కథా వస్తువుకు ఎక్కడా అన్యాయం చేయలేదు రచయిత. తాను చెప్పదలచుకున్న విషయాన్ని అర్ధంతరంగా ముగించలేదు. తన మనసులో మెదిలిన భావాన్ని పూర్తి స్పష్టతతో సంక్షిప్తంగా వ్యక్తీకరించారు. ఇందులో హాస్య ప్రధాన కథలు కొన్నయితే, వాస్తవికతను వ్యక్తపరిచిన కథలు కొన్ని. గుండెల్ని మెలిపెట్టేవీ ఉన్నాయి, మనసును తట్టి లేపినవీ ఉన్నాయి. ‘రచయిత తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ రాసే రచనలు బుక్షెల్ఫ్కే పరిమితం అవుతాయం’టాడు ఓ ఆంగ్ల కవి. సమాజ హితం కోరుతూ రాసే చిట్టి కథైనా గట్టి మేలు తలపెడుతుంది. అలాంటి కథల సమాహారమే ‘గరం గరం చాయ్’. ఇందులోని 50 కథలు.. విలక్షణతకు అద్దం పడుతూనే, సలక్షణమైన సందేశాన్ని అందించాయి. వేడిగా, వాడిగా సాగిపోయిన ఈ కథలను గరం గరం చాయ్ తాగుతూ చదివేయండి మరి!
రచయిత: ఆర్సీ కృష్ణస్వామి రాజు
పేజీలు: 168, వెల: రూ.100
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు 93936 62821
రచన : రాజా హైదరాబాదీ
పేజీలు : 94;
ధర : రూ.200
ప్రచురణ : ఝరీ పొయిట్రీ సర్కిల్
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 93923 02245
రచన : ఏనుగు కిశోర్‌బాబు
పేజీలు : 24;
ధర : రూ.50
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 94440 23920