చరిత్రకెక్కిన పర్యావరణం
సునీల్ అమృత్ రచించిన ది బర్నింగ్ ఎర్త్ (గత 500 ఏళ్ల పర్యావరణ చరిత్ర) పుస్తకం ఇప్పడొక సంచలనం. 2025 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ కోసం ప్రకటించిన ఆరు నాన్-ఫిక్షన్ రచనలలో ఇదీ ఒకటిగా ఎంపికైంది. ఐదు శతాబ్దాల చరిత్రను అనుసరిస్తూ సాగిన ఈ రచన.. మన పురోగతి, విపత్తుల పరస్పర అనుబంధం తెలియపరుస్తుంది. ఈ పుస్తకం మంగోలు సామ్రాజ్యం నుంచి మొదలవుతుంది. ఆ తరువాత మొఘల్ సామ్రాజ్యంలోకి, క్వింగ్ రాజవంశపు నౌకలలోకి పాఠకుణ్ని తీసుకెళ్తుంది.
ముఖ్యంగా బియ్యం వ్యాప్తి చరిత్ర ఇందులో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యవసాయ విప్లవం గురించి అనేక గ్రంథాలు వెలువడినా.. బియ్యం గురించి ప్రస్తావన ఎక్కడా పెద్దగా కనిపించదు. అయితే పరిశ్రమల ఆధారిత వ్యవసాయం పుట్టుకకు ముందు మానవాళిని అత్యధికంగా పోషించిన పంట బియ్యం అని పుస్తకం విపులీకరిస్తుంది. తర్వాతి అధ్యాయాలు రష్యా సామ్రాజ్య విస్తరణ, చైనా, భారతదేశంలో భూములు, పన్నుల నియంత్రణ, వ్యాపారం, వలస పాలన గురించి చర్చిస్తాయి.
ఇలా ప్రపంచవ్యాప్త ఉదాహరణలు ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. వివిధ సంఘటనలు, అనుభవాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు, ఆశ్చర్యకరమైన సంబంధాలు ఇలా ఇందులో అన్నీ మిళితమై ఉన్నాయి. ఈ కల్పానికేతర నవల ఆర్థిక, సామాజిక, పర్యావరణ చరిత్రల మధ్య అల్లుకుపోయినట్లు అనిపిస్తుంది. ఈ పుస్తకం చదవడం ద్వారా పాఠకులకు కొత్త విషయాలు ఎన్నో తెలుస్తాయి. ముఖ్యంగా రచయిత శైలి, ఆయన వివరించిన పర్యావరణ, సామాజిక అంశాలు, వాటి గురించి చేసిన సున్నితమైన వాదన అన్నీ విలువైన సమాచారాన్ని అందిస్తాయి.
రచయిత: సునీల్ అమృత్
ధర: రూ.539 నుంచి..
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్
…? డా॥ సాల్మన్‌రాజు యార్లగడ్డ
రచన : ఎమ్బీయస్ ప్రసాద్
పేజీలు : 240;
ధర : రూ.150
ప్రతులకు : నవోదయ బుక్ హౌజ్, హైదరాబాద్ ,ఫోన్ : 90004 13413
రచన : లక్ష్మణ్‌రావు పతంగే
పేజీలు : 62; ధర : రూ.60
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు ,ఫోన్ : 92900 79047