పుస్తక సమీక్ష
భారత దేశంలో సిపాయిల తిరుగుబాటుకి ముందు ఈశాన్య ప్రాంతంలో జరిగిన నిజమైన కథే ఈ నవల. బ్రిటిష్ వలసవాదులు మన దేశ అటవీ సంపదను కొల్లగొట్టేందుకు ఈ ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తారు. దీనికి వ్యతిరేకంగా స్థానిక గిరిజనులు తిరుగుబాటు చేస్తారు.
మరో భారతం
భారత దేశంలో సిపాయిల తిరుగుబాటుకి ముందు ఈశాన్య ప్రాంతంలో జరిగిన నిజమైన కథే ఈ నవల. బ్రిటిష్ వలసవాదులు మన దేశ అటవీ సంపదను కొల్లగొట్టేందుకు ఈ ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తారు. దీనికి వ్యతిరేకంగా స్థానిక గిరిజనులు తిరుగుబాటు చేస్తారు. ఈ తరుణంలోనే అబోర్ జాతికి చెందిన గీమూర్, మరో గిరిజాతికి చెందిన కజిన్ ష అనే యువకుణ్ని ప్రేమించి, తన జాతిని వదిలేసి కజిన్ షతో వెళ్లిపోతుంది. అక్కడ తాను రెండో భార్యనని తెలుసుకొని కజిన్ షకు మరో యువతితో సంబంధం ఉన్నదనే అనుమానంతో తన గ్రామానికి తిరిగొస్తుంది.
ఇదే సమయంలో ఫ్రాన్స్కు చెందిన క్రిక్ గిరి ప్రాంతాలకు వస్తాడు. స్థానికులు అతణ్ని వ్యతిరేకిస్తారు. క్రిక్ మాత్రం ఆ గిరి ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తూ, ప్రజలకు దగ్గరవుతాడు. ఇలా రకరకాల మలుపులతో సాగిపోయే ఈ నవల ఈశాన్య భారతం జీవన శిల్పాన్ని కండ్ల ముందు ఉంచుతుంది. మరుగునపడిన ఒక పోరాట చరిత్రతోపాటు మానవ ప్రవర్తనా రీతులు ఎంత విచిత్రంగా ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ నవలను చదివి తీరాల్సిందే. భావితరాలకు ఇదొక పరిశోధనా గ్రంథంగానూ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
మిష్మీ కొండలు (నవల)
రచయిత: మమాంగ్ డాయ్
అనువాదం: మూర్తి కేవీవీఎస్
పేజీలు: 233, ధర: రూ.230
ప్రతులకు: 78935 41003
-రాజు పిల్లనగోయిన
అగ్గి మొగ్గలు (కవిత్వం)
రచన: పిట్ట సాంబయ్య
పేజీలు: 110
ధర: రూ. 100
ప్రచురణ: ప్రజ్వల ప్రచురణలు
ప్రతులకు:ఫోన్: 98496 74768
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

