హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తేతెలంగాణ): పార్టీ ఫిరాయింపు కేసులో తనను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టనున్నది.
దానం పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సోమవారం సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించే తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది.