ప్రతి మనిషిలోనూ ఆలోచనలు, సంఘర్షణలు, మనసుని బాధపెట్టిన విషయాలు అనేకం ఉంటాయి. అవన్నీ మాటల రూపంలో మాత్రమే బయటికి వస్తుంటాయి. ఎంత ముఖ్యమైనవైనా కూడా.. కొన్ని వారాలపాటు మాత్రమే చెప్పినవారికి, విన్నవారికి గుర్తుంటాయి. కానీ, అవే విషయాలు అక్షర రూపం దాల్చితే.. ఎప్పుడైనా, ఎక్కడైనా చదువుకునేందుకు భద్రంగా ఉంటాయి. రచయిత్రి లావణ్య అదే ప్రయత్నం చేశారు. తన మనసులోని భావాలన్నీ కలిపి, 39 కథలుగా మలిచి.. ‘భావలావణ్యం’ కథా సంపుటిని తీసుకొచ్చారు. ఈ పుస్తకంలోని కథల సంఖ్యను చూసి.. ‘ఇన్ని ఎలా చదివేది?’ అనుకునేరు. అవన్నీ మూడు నాలుగు పేజీలకు మించకుండా.. సహజత్వానికి దగ్గరగా ఉండేవే.
చకచకా చదివించేవే. తన చుట్టూ జరుగుతున్న రకరకాల సంఘటనలు, వార్తా పత్రికలు, టీవీలలో చూసిన విషయాలు, ఫేస్బుక్లో చదివిన పోస్టులను ప్రేరణగా తీసుకొని.. ఎలాంటి డ్రామా లేకుండా ఈ కథలను రాశారు లావణ్య. సోమరితనంతో బాధ్యతలను విస్మరించిన తన భర్తకు బతుకు పాఠం నేర్పిన ‘సమర్థురాలు’ అయిన ఓ ఇల్లాలి కథ. మానసిక ఒత్తిడితో చేతికొచ్చిన కొడుకు చనిపోతే.. ఆ దుఃఖాన్ని దిగమింగుకొని సమాజ మేల్కొలుపుకై ‘కిం కర్తవ్యం’తో సాగే ఓ తండ్రి ప్రస్థానం. ఇలా మనచుట్టూ అల్లుకున్న సంఘటనల సారాన్ని రచయిత్రి తన కథల్లో రాసుకొచ్చారు. ముక్కుసూటిగా సాగే ఈ తరహా కథలు చదివితేనే.. వాటి లోతు తెలుస్తుంది.
రచయిత: లావణ్య బుద్ధవరపు
పేజీలు: 200, ధర: రూ.200
ప్రతులకు: 81848 97897
-రాజు పిల్లనగోయిన
మనో విహారి అనువాదం : కస్తూరి రాజశేఖర్
పేజీలు : 127;
ధర : రూ.100
ప్రచురణ : కస్తూరి ప్రచురణలు
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 98493 30930
రచన : కరిపె రాజ్‌కుమార్
పేజీలు : 112;
ధర : రూ.150
ప్రచురణ : పాలపిట్ట బుక్స్
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 98487 87284
రచన : ఏనుగు కిశోర్ బాబు
పేజీలు : 156;
ధర : రూ.200
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 94440 23920