పుస్తకంలేని ఇల్లు.. ఆత్మలేని శరీరం లాంటిది.
మానవత్వాన్ని చాటే నాటకాలు
తెలుగు నాటక రంగాన్ని ఎంతోమంది నాటక కర్తలు ఎప్పటికప్పుడు సుసంపన్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో రావుల పుల్లాచారి ఒకరు. ఆయన 50కి పైగా కథలు, 20కి పైగా నాటకాలు రచించారు. వీటిలో తెలంగాణ యాస, ప్రజల కష్టాలు సమ్మిళితంగా మనకు కనిపిస్తాయి. ఆయన రాసిన నాటకాలను ‘రచ్చబండ’ పేరుతో సంకలనంగా అచ్చువేయించారు. ఇందులో ఉన్న ఎనిమిది నాటకాలూ సమాజంలో జరుగుతున్న వాటిని ప్రత్యక్షంగా మనముందు నిలబెడతాయి.
‘బాకీ పడ్డ బ్రతుకులు’లో గ్రామాల్లో భూస్వాములు అమాయక ప్రజలను ఎలా మోసం చేస్తారో భుజంగం పాత్ర ద్వారా చూపిస్తారు. ఇక ‘రచ్చబండ’ పుల్లాచారికి ఉత్తమ రచయితగా రెండు నంది అవార్డులను అందించింది. ఇందులో ప్రధాన పాత్ర మల్లయ్య ఆత్మాభిమానం కలిగిన రైతు. పిల్లలకోసం ఉన్న భూమిని అమ్ముకుని, బర్లు కాస్తూ బతుకుతుంటాడు. ఆ బర్రెలు తన పొలాన్ని తొక్కి పాడుచేశాయనే నెపంతో శివయ్య, తన బర్రెను అక్రమంగా అమ్ముకున్నాడనే నెపంతో పింజారి భద్రయ్య ఇద్దరూ కలిసి మల్లయ్యను అవమానిస్తారు.
ఎవరి దగ్గరా ఎన్నడూ తలవంచని మల్లయ్య పంచాయతీకి వెళ్లడం తలవంపులుగా భావిస్తాడు. ఆ అవమానభారం తట్టుకోలేక, మానసిక క్షోభకు గురై మరణిస్తాడు. రచయిత ఈ సన్నివేశాన్ని చిత్రించిన తీరు పాఠకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. కొసమెరుపు ఏంటంటే.. చివరికి మల్లయ్య నిర్దోషి అని తేలడం. ఇలా ‘రచ్చబండ’లోని ప్రతీ నాటిక సమాజంలో జరుగుతున్న అంశాలతో రూపొందిందే. రచయిత ఈ నాటకాల్లో సమస్యను చూపిస్తూనే దానికి తగిన పరిష్కారంతో ఆశావహమైన ముగింపును ఇస్తారు.
రచ్చబండ
రచన: రావుల పుల్లాచారి
పేజీలు: 225, ధర: రూ. 200
ప్రతులకు: ఫోన్. 99492 08476
ముంబయి నుండి…
రచన: అంబల్ల జనార్దన్
పేజీలు: 205
ధర: రూ. 360
ప్రచురణ: జనంబ ప్రచురణలు
ప్రతులకు: ప్రముఖ
పుస్తకాల దుకాణాలు
ఫోన్: 88503 49858
సన్మానం మీకే (హాస్య వ్యంగ్య కథలు)
Books2
రచన: పోట్లూరు సుబ్రహ్మణ్యం
పేజీలు: 252, ధర: రూ. 250
ప్రచురణ: ప్రియమైన ప్రచురణలు
ప్రతులకు: ఫోన్: 94911 28052
చంద్రుడు లేని ఆకాశం
రచన: గజ్జెల రామకృష్ణ
పేజీలు: 91
ధర: అముద్రితం
ప్రతులకు:
ఫోన్: 89774 12795
…? అరుణ ధూళిపాళ