ప్లేట్ల మీద డిజైన్ బాగున్నాయని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్టే !!
Plates Decoration Ideas | ఎవరైనా పార్టీ మారితేనో, మాట మార్చితేనో ప్లేటు ఫిరాయించారని అంటాం. ఏకంగా ప్లేటే.. ప్లేటు ఫిరాయిస్తే? అదే జరుగుతున్నది ఇప్పుడు. ఈ ప్లేట్లలో ప్రింట్లలా కనిపిస్తున్న డిజైన్లన్నీ నిజమైన పండ్లూ కూరగాయల ముక్కలే. కళ్లను కనికట్టు చేసే ఈ కళను సలాడ్ ఆర్ట్, ఫుడ్ ల్యాండ్ స్కేపింగ్ తదితర పేర్లతో పిలుస్తున్నారు.

కుంచె పట్టుకుని క్యాన్వాస్ మీద చిత్రం గీస్తే.. కళ్లారా చూసి ఆనందిస్తాం. అదే కత్తినే కుంచెగా మార్చి కూరగాయలతో… ప్లేటు మీద చిత్రాలు వేస్తే … కళ్లతో చూసి, చేత్తో తాకి, చటుక్కున నోట్లో వేసుకోవచ్చు. అలా ‘ఫుడ్ ఆర్ట్’ అటు ఆనందాన్ని, ఇటు ఆరోగ్యాన్ని అందిస్తున్నది. భోజనానికి ముందు సలాడ్ల పేరుతో పండ్లూ కూరగాయల ముక్కల్ని అందించడం తెలిసిందే. ఇక్కడి చిత్రాల్లో కనిపిస్తున్నవన్నీ అందంగా తీర్చిదిద్దిన అలాంటి సలాడ్లే. పెద్ద పెద్ద హోటళ్లలో పనిచేసే షెఫ్‌లు వీటిని పొందికగా సిద్ధం చేస్తారు.

ఈ కళను వడ్డించడానికి ఎక్కువగా తెలుపూ, నలుపూ, బూడిదరంగు ప్లేట్లను ఎంచుకుంటారు. అనుకున్న చిత్రాన్ని బట్టి ఆయా కూరగాయలు, పండ్ల ముక్కలను సరైన ఆకృతి, పరిమాణాల్లో తరగడం అసలైన సవాలు. ఇందుకోసం రకరకాల సైజుల కత్తులు, చాప్‌స్టిక్స్ తదితర వస్తువుల్ని ఉపయోగిస్తారు. సలాడ్ ప్లేటింగ్‌లో ఎక్కువగా ఉల్లిగడ్డ, కీరా, క్యారెట్లతో పాటు పుచ్చకాయ, చెర్రీల్లాంటి వాటినీ వాడతారు. చాలామంది సలాడ్లను ఇష్టపడరు. ఇలా ఆకర్షణీయంగా వడ్డిస్తే.. క్షణాల్లో ప్లేటు ఖాళీ చేసేస్తారు. వీటిని సులభంగా ఎలా చేయాలో తెలుసుకునేందుకు యూట్యూబ్‌లో రకరకాల వీడియోలూ ఉన్నాయి. కాబట్టి, కాస్త ఖాళీ దొరికితే మనమూ ప్రయత్నించి వరల్డ్‌క్లాస్ షెఫ్లా పోజులు కొట్టొచ్చన్న మాట!

Read More :
ఫ్రెంచ్ కంపెనీ తీసుకొచ్చిన ఈ డైనింగ్ సెట్స్ చూశారా !!”
Viral video: కోల్‌కతా విమానాశ్రయంలో సిబ్బందితో కలిసి నటి మోనామీ ఘోష్ డ్యాన్స్.. వీడియో వైరల్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Decoration
- design
- plates
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

