Liposuction | కొవ్వు కరిగించే ఈ సర్జరీ ఎందుకంత ప్రమాదం? కన్నడ నటి చేతనా రాజ్ మరణానికి కారణం కూడా అదేనా!
Liposuction | నిండా ఇరవయ్యేండ్లు కూడా లేని కన్నడ తార చేతనా రాజ్ తీరైన శరీరాకృతి కోసం చేయించుకున్న కాస్మొటిక్ సర్జరీ ఆమె ప్రాణాలనే బలిగొన్నది. కొవ్వు పెంచుకోవడం సులభం. కరిగించుకోవడమే కష్టం. దానికి కూడా సులువైన ఉపాయాలు ఆలోచిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నది యువతరం.
ఒకప్పుడు కాస్మొటిక్ సర్జరీలు సంపన్నులకే పరిమితం. ఇటీవల మధ్యతరగతికి కూడా మోజు పెరిగింది. మారిన జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే శరీరాకృతిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం దీనికి ప్రధాన కారణం. జీవనశైలి మార్పులతో కొవ్వును వదిలించుకునే అవకాశం ఉన్నా.. తక్షణ ఫలితాల కోసం సర్జరీలకు మొగ్గు చూపుతున్నారు. అందులోనూ శరీరంలోని వివిధ భాగాల నుంచి కొవ్వును నేరుగా తీసే ఆధునిక ప్రక్రియ అయిన లైపోసక్షన్ వీళ్లను ఆకర్షిస్తున్నది.

లైపోసక్షన్ అంటే…
లైపోసక్షన్ చికిత్సా విధానంలో పొట్ట, తొడలు, నడుములాంటి భాగాల నుంచి కొవ్వును తొలగిస్తారు. కొవ్వు తొలగించాలనుకునే చోట చిన్న గాటు పెడతారు. దాని ద్వారా సక్షన్ పరికరాన్ని ఉపయోగించి ఎముకకూ కండకూ మధ్యలోని కొవ్వును లాగేస్తారు. ఇది ప్రమాదకరమైన పద్ధతి. వైద్య నిపుణులు అత్యవసరమని సూచిస్తేనే చేయించు
కోవాలి. అది కూడా శరీర బరువులో 5 శాతం కొవ్వును మాత్రమే ఒక సిట్టింగ్లో తొలగించాలి. అంతకన్నా ఎక్కువ తొలగించాల్సి వస్తే ఐసీయూ సౌకర్యం తప్పనిసరి.
ఎలాంటి దుష్ఫలితాలు?
లైపోసక్షన్ ద్వారా కొవ్వు తీసేప్పుడు అది విడిపోయి రక్తం ద్వారా ప్రవహించి నేరుగా మెదడుకు చేరే అవకాశం ఉంది. పొట్ట ప్రాంతంలోని కొవ్వు ఊపిరితిత్తుల్లో చేరుకునే
ప్రమాదం లేకపోలేదు. గుండెపోటు, అధిక రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం, ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలూ రావచ్చు. నరాలు, రక్తనాళాలు దెబ్బతినవచ్చు. కిడ్నీలు, గుండె పని
చేయకుండా పోవచ్చు. మరణానికీ దారి తీయవచ్చు. చేతనా రాజ్ విషయంలో జరిగింది ఇదే.
ఎవరు చేయించుకోకూడదు?
ధూమపానం అలవాటు ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు లైపోసక్షన్కు దూరంగా ఉండటమే మేలు. మధుమేహం, గుండె జబ్బులు, మూర్ఛవ్యాధి లాంటివి ఉన్నా, రక్తం పలచబడేందుకు మందులు వాడుతున్నా ఈ తరహా చికిత్స ఎంచుకోకూడదు. ఆరోగ్య పరమైన కారణాలవల్ల లైపో తప్పనిసరి అయినప్పుడు.. ఇంటెన్సివ్ కేర్ సౌకర్యం ఉండాలి. నిపుణులైన వైద్య బృందం అందుబాటులో ఉన్న హాస్పిటల్నే ఎంచుకోవాలి.
Read More :
నటి చేతనారాజ్ను బలిగొన్న ప్లాస్టిక్ సర్జరీ
Belly Fat | పొట్ట చుట్టూ పెరిగిన కొవ్వును ఇలా తగ్గించుకోండి..”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

