గెర్నికా ఒక వర్ణచిత్రం. 1936 45 మధ్య రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సుప్రసిద్ధ చిత్రకారుడు పాబ్లో పికాసో చేతినుంచి ఊపిరిపోసుకున్న చిత్రమది. దాని స్ఫూర్తితో కరిపె రాజ్‌కుమార్ 52 కవితలతో ‘గెర్నికా’ సంకలనం వెలువరించారు. తల్లి గర్భంలో అంకురించింది మొదలు అంతిమ ఘడియల వరకు మనిషి నిరంతరం పోరాటం చేయాల్సిందే! అయితే, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు ప్రధాన సూత్రధారుల కంటే అమాయకులనే ఎక్కువగా బలి పెడుతున్నాయి.
ఈ పరిస్థితులకు చలించిన రాజ్‌కుమార్ తన భావాలకు అక్షర రూపమిచ్చారు. ఈ సంకలనంలో తొలి కవిత ‘గ్రీష్మం’ భీష్మ ప్రతాపాన్ని అనుభూతికి తెస్తుంది. మరో కవిత ముగ్గులకు నింగిలోని చుక్కలకు అభేదం చెబుతూ సాగుతుంది. ‘కడెం’ కవిత ఆదిలాబాద్ అడవుల్లో పుట్టి గోదావరిలో కలిసిపోయే కడెం నది ప్రయాణాన్ని వివరిస్తుంది. ‘గంగనీళ్ల జాతర’ కవిత అడెల్లి పోచమ్మ జాతర వైభవాన్ని కళ్ల ముందు నిలుపుతుంది.
‘నిర్మల్ గుట్టల నినాదమా’ కవిత రాంజీ గోండు పోరాట స్ఫూర్తిని చాటుతుంది. ‘వీరగల్లులమై విస్తరిద్దాం’ కవిత చెడు నుంచి సమాజాన్ని రక్షించడానికి మనుషులు వీరగల్లులు కావాలని ఒకనాటి చరిత్రను గుర్తుచేస్తుంది. గుస్సాడి కనకరాజు, మహాకవి శ్రీశ్రీ, మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు నీరాజనాలు అర్పిస్తూ మరికొన్ని కవితలు సాగిపోతాయి. ఇంకొన్ని కవితలు బాల్యపు మధురానుభూతులను నెమరువేసుకుంటాయి. సమాజంలోని కుళ్లును ప్రశ్నిస్తూ సాగుతాయి. పాఠకుల ఆలోచన పరిధిని పెంచుతాయి.
రచన: కరిపె రాజ్‌కుమార్
పేజీలు: 112; ధర: రూ. 150
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 81251 44729
రచన: విజయలక్ష్మి కొలపర్తి
పేజీలు: 96; ధర: రూ. 150
ప్రచురణ: కవి పబ్లికేషన్స్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 85588 99478
పేజీలు: 52; ధర: రూ. 50
ప్రతులకు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ ఉద్యమ యూనిట్లు
ఫోన్: 99495 35695
రచన: చింతా రాంబాబు
పేజీలు: 70; ధర: రూ. 120
ప్రచురణ: కార్తీక్ నిహాల్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 99481 78092