ప్రకృతి (నేచర్) ఫొటోగ్రఫీ ప్రత్యేకమైంది. అందులోనూ మొక్కలు, లేలేత చిగుర్లు, పూల రేకులను కెమెరాల్లో బంధించడం.. మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. విభిన్న ఆకృతుల్లో ఉండే చెట్ల ఆకులు, వాటిపైనుంచి జాలువారే నీటి బిందువులను కలుపుకొంటూ.. ప్రకృతి సౌందర్యాన్ని ‘క్లిక్’ మనిపించడం.. అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. కేవలం మొబైల్ ఫోన్‌తో, ప్రకృతిలో కనిపించే అతిచిన్న వివరాలను ఫొటోలుగా మలిచే మొక్కల మాక్రో షాట్లను ఎలా తీయాలో తెలుసుకుందాం.
ఆధునిక స్మార్ట్ఫోన్లు చాలావరకు శక్తిమంతమైన మాక్రో లెన్స్‌లతో వస్తున్నాయి. ఇవి మొక్కల్లోని అతిసూక్ష్మ వివరాలను కూడా గొప్పగా క్యాప్చర్ చేస్తాయి. అయితే, మీ ఫొటోలను మరింత మెరుగుపరచడానికి ఈ సెట్టింగ్స్ ఫాలో అయితే చాలు.
మొక్కల క్లోజప్ ఫొటోలు మరింత షార్ప్‌గా రావాలంటే.. లైటింగ్ చాలా అవసరం. కాబట్టి, కింది సూచనలు పాటిస్తే సరి.
మంచి కంపోజిషన్‌లో తీసే ఫొటోలు.. కళాత్మకంగా వస్తాయి. దృశ్యపరంగా ఆకర్షణీయంగానూ కనిపిస్తాయి.
లో యాంగిల్ షాట్లు : మొక్కను లో యాంగిల్ (కింది నుంచి) చూడటం వల్ల.. అంతెత్తున, అద్భుతంగా కనిపిస్తుంది.
టాప్ యాంగిల్ షాట్లు : మొక్కలను పైనుంచి చూస్తే విభిన్నంగా కనిపిస్తాయి. వాటి లేలేత చిగుర్లను ఫొటోలు తీయడానికి టాప్ యాంగిల్లో ఫొటోలు తీయండి.
టాప్ డౌన్ షాట్లు : ఆకు నమూనాలు, పువ్వులను ఫొటోలు తీయడానికి పనిచేస్తుంది.
క్లోజప్ ప్లాంట్ ఫొటోగ్రఫీలో వివరాలు, రంగులను మరింత మెరుపరచడానికి ఫొటోలను ఎడిటింగ్ చేయండి. అందుకోసం కింది యాప్‌లు వాడండి.
Snapseed : బ్రైట్నెస్, కాంట్రాస్ట్, షార్ప్‌నెస్‌ను సర్దుబాటు చేయడానికి.
Adobe Lightroom Mobile : క్లారిటీ – టెక్చర్ వివరాలను మరింత మెరుగుపరచడానికి.
VSCO : ఫొటోలకు ఆర్టిస్టిక్ ఫిల్టర్లను జోడించడానికి.
ప్రో టిప్ : ఫొటోల్లో డీటెయిల్ ప్రత్యేకంగా కనిపించేందుకు షార్ప్‌నెస్, కాంట్రాస్ట్‌ను కొద్దిగా పెంచండి. అతిగా సవరిస్తే ఫొటోలు ఎబ్బెట్టుగా కనిపిస్తాయి.
ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌లో మాక్రో లెన్స్ లేకపోతే.. క్లోజప్ షాట్స్ కోసం క్లిప్-ఆన్ మాక్రో లెన్స్‌ని ఉపయోగించండి. ఫోకస్, లైటింగ్‌తోపాటు కంపోజిషన్‌పై పట్టు సాధించడం ద్వారా.. నిత్యం చూసే మొక్కలనే అద్భుతమైన కళాఖండాలుగా మార్చవచ్చు. ఫోన్‌ను తీసుకోండి.. మొక్కల అందాన్ని అన్వేషించండి. ప్రకృతిలో ఉండే చిన్నచిన్న అద్భుతాలను ‘క్లిక్’ మనిపించడం మొదలుపెట్టండి.
– ఆడెపు హరికృష్ణ