ముంబై : ఐపీఎల్లో క్రిస్ గేల్(Chris Gayle)కు ప్రత్యేక స్థానం. పొట్టి ఫార్మాట్ క్రికెట్లో అతను తన పవర్ హిట్టింగ్తో క్రికెట్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేశాడు. పలు ఫ్రాంచైజీల తరపున ఆడుతూ.. భారీ షాట్లతో అతను ఆకట్టుకున్నాడు. అయితే క్రిస్ గేల్ ఓ దశలో డిప్రెషన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్న సమయంలో తీవ్ర మనోవేదనకు గురైనట్లు గేల్ చెప్పాడు. శుభంకర్ మిశ్రాకు ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో గేల్ ఈ విషయాన్ని చెప్పాడు. కెరీర్ ముగింపు దశలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు.
ఐపీఎల్లో అత్యధికంగా 175 రన్స్ చేసిన బ్యాటర్‌గా గేల్ రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో పాటు ఎన్నో రికార్డులను అతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో అతను కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడాడు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలో అతను రికార్డులు తిరగరాశాడు. కోహ్లీ, డివిల్లీర్స్‌తో కలిసి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. కెరీర్ చివరి దశలో అతను పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడాడు. అయితే 2018 నుంచి పంజాబ్ తరపు 41 మ్యాచ్‌లు ఆడి 1339 రన్స్ స్కోర్ చేశాడతను. 2021 మధ్యలోనే అతను ఫ్రాంచైజీ నుంచి తప్పుకున్నాడు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆ టోర్నీ జరిగిన విషయం తెలిసిందే.
తన ఐపీఎల్ జర్నీ అకస్మాత్తుగా ముగిసిందని గేల్ తెలిపాడు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తన పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు పేర్కొన్నాడు. తాను డిప్రెషన్లోకి వెళ్లే రీతిలో ఆ జట్టు చేసిందని ఆరోపించాడతను. ఓ సీనియర్‌గా తనకు అక్కడ గౌరవం దక్కలేదన్నాడు. లీగ్ కోసం ఎంతో చేశానని, ఫ్రాంచైజీకి విలువ తీసుకువచ్చానని, కానీ ఆ సమయంలో అగౌరవపరచడం సరికాదు అని గేల్ అన్నాడు. ఓ పిల్లోడిలా చూశారని, ఆ సమయంలో తన జీవితంలో తొలిసారి డిప్రెషన్ ఆలోచనలు వచ్చినట్లు గేల్ చెప్పాడు. తనకు జరిగిన అమర్యాద పట్ల అనిల్ కుంబ్లే ముందు ఏడ్చేసినట్లు తెలిపాడు. కోచ్, ఫ్రాంచైజీ వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ కుంబ్లే ముందు తన బాధను వెలగక్కినట్లు చెప్పాడు. ఆ సీజన్లో మొంబై ఇండియన్స్‌తో చివరి మ్యాచ్ ఆడేశానని, అప్పటి పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో మ్యాచ్ ఆడాలని కోరినా, తాను ఆడలేకపోయినట్లు గేల్ గుర్తు చేశాడు.
Chris Gayle Opens Up | How Punjab Kings Disrespected Him#Chrisgayle #IPL #PunjabKings pic.twitter.com/dlTQDITh1u
— NewsBook (@NewsBookMedia) September 7, 2025