మధిర, సెప్టెంబర్ 08 : కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో యువజన, విద్యార్థి సంఘ సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల పేరుతో నమ్మించి మోసం చేసిందన్నారు. ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తామని, చదువుకుంటున్న యువతులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మధిర ఏఎంసీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, మధిర మండల రైతు సంఘం మాజీ కన్వీనర్ చావా వేణు, మధిర మండల బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, మధిర మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ వైవి అప్పారావు, మధిర శివాలయం మాజీ అధ్యక్షుడు వంకాయలపాటి నాగేశ్వరరావు, బీఆర్ఎస్ మధిర మండల యూత్ అధ్యక్షుడు కోన నరేందర్ రెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షుడు సర్వేషు దిల్లు, వంగవీడు మాజీ ప్రెసిడెంట్ బొగ్గుల వీరారెడ్డి, కృష్ణాపురం మాజీ ప్రెసిడెంట్ బుర్రి బాబురావు, పల్లపాటి కోటేశ్వరరావు, ఆయిలూరి ఉమామహేశ్వర్ రెడ్డి, పరిశ శ్రీనివాసరావు, ఆళ్ల నాగబాబు, కందుకూరి నాగబాబు, చీదిరాల రాంబాబు, అబ్దుల్ ఖురేషి పాల్గొన్నారు.