కాలగతిని శాసించే సూర్య భగవానుడు ఉత్తర దిశగా ప్రయాణం మొదలుపెట్టే పర్వం మకర సంక్రాంతి. ఈ రోజున దక్షిణ భారతదేశంలో సూర్యుడికి పొంగలి నివేదిస్తారు. ఉత్తర దేశంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. పిల్లా పెద్దా తేడా లేకుండా పతంగులు ఎగరవేస్తారు. స్త్రీలు వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు. వ్యవసాయంలో రైతుకు సాయంగా ఉండే పశువులకూ సంక్రాంతి కూడా పండుగ వేళే! భారతదేశంలో ఏ ప్రాంతంలో సంక్రాంతిని ఎలా జరుపుకొంటారో తెలుసుకుందాం.
తెలుగు రాష్ర్టాల్లో సంక్రాంతిని భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా నాలుగు రోజులు జరుపుకొంటారు. భోగి మంటలు, పొంగలి నివేదన, భోగిపండ్లు, పశువుల అలంకరణ, వాయనాలు ఇచ్చిపుచ్చుకోవడం ఇక్కడి ప్రత్యేకతలు.
ఇక్కడ సంక్రాంతిని ఉత్తరాయణ్ పేరుతో నిర్వహిస్తారు. పతంగులను ఎగరవేస్తూ ఉల్లాసంగా గడిపేస్తారు.
భోగాలి బిహు లేదా మాఘ్ బిహుగా పిలుస్తారు. ఇక్కడ కూడా సంక్రాంతి పంటల పండుగే. మేజి పేరుతో మంట వేసి అగ్ని దేవుణ్ని ప్రార్థిస్తారు. ఇండ్లలో మిఠాయిలు చేసుకుంటారు.
ఇక్కడ కిచిడీ పర్వ్ పేరుతో సంక్రాంతిని జరుపుకొంటారు. ప్రయాగలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇండ్లలో కిచిడీ వండి సూర్యుడికి నివేదిస్తారు.
ఈ రాష్ట్రంలో సుగ్గి అని పిలుస్తారు. తెల్ల నువ్వులు, వేయించిన పల్లీలు, ఎండు కొబ్బరి తురుము, బెల్లంతో చేసిన మిఠాయిలను బంధువులతో ఇచ్చిపుచ్చుకునే ‘ఎల్లు బిరొదు’ ఆచారం ఇక్కడ ఉంది.
ఈ రాష్ట్రంలో సంక్రాంతిని ‘పొంగల్’ అని పిలుస్తారు. భోగి, పొంగల్, మాట్టు పొంగల్ పేరుతో సంక్రాంతి సంబురాన్ని మూడు రోజులు జరుపుకొంటారు.
ఈ రెండు రాష్ర్టాల్లో మకర సంక్రాంతిని మాఘి సంక్రాంత్ అనీ, హల్దీ కుంకుమ్ అనీ పిలుస్తారు. వేడుకలు 15 రోజులపాటు జరుగుతాయి. పెళ్లయిన స్త్రీలు తమ జీవితాలు సుఖసంతోషాలతో సాగిపోవాలని కోరుకుంటూ ఒకరికొకరు పసుపు కుంకుమలు ఇచ్చుకుంటారు.
ఇక్కడ సంక్రాంతిని పౌష్ సంక్రాంతిగా పిలుస్తారు. గ్రామాల్లో ఇండ్ల ముందు అందమైన ముగ్గులు తీర్చిదిద్దుతారు. మామిడాకుల తోరణాలు కట్టి లక్ష్మీదేవిని ఇళ్లకు ఆహ్వానిస్తారు.
మాఘ సాజిగా పిలుస్తారు. ఓ మట్టిపాత్రలో అన్నం వండుతారు. పతంగులు ఎగరవేస్తారు.
ఈ రాష్ట్ర రైతాంగం సంక్రాంతిని లోహ్రి పేరుతో జరుపుకొంటారు. పంటకోతలకు ముందు అగ్ని దేవుడిని తమకు మంచి దిగుబడులు ప్రసాదించాలని ప్రార్థిస్తారు. ‘ఆడార్ ఆయే దిలాతేర్ జాయే’ (గౌరవం రావాలి.. పేదరికం పోవాలి) అని ఉచ్చరిస్తూ అగ్ని చుట్టూ తిరుగుతారు.
ఈ రాష్ర్టాల్లో సక్రాత్ (ఢిల్లీ, హరియాణా), సుక్రాత్ (మధ్యప్రదేశ్), సక్రాత్ (రాజస్థాన్) అని పిలుస్తారు. సూర్యుడిని ప్రార్థిస్తారు. నువ్వులు ప్రధానంగా మిఠాయిలు తయారుచేసుకుంటారు.
ఈ రాష్ట్రంలో మకర చౌలా పేరుతో సంక్రాంతిని జరుపుకొంటారు. మకర చౌలా అంటే.. చక్కెర, అరటిపండు, కొబ్బరి, మిరియాలతో చేసిన తియ్యటి అన్నం. కోణార్క్ సూర్య దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తారు.
జమ్ము, కశ్మీర్ ప్రాంతాల్లో శిశుర్ సంక్రాత్గా జరుపుకొంటారు. మాఘి సంక్రాంత్ అని కూడా పిలుచుకుంటారు.