ఒక కథ రాయాలంటే.. రచయిత తన శక్తియుక్తులను సమర్థంగా ఉపయోగించుకోవాలి. సరైన ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. రాసే కథల్లో ప్రారంభ ముగింపులు ఆసక్తికరంగా మలచాలి. అలాంటి లక్షణాలున్న రచనలు చేయడంలో.. ఐతా చంద్రయ్య ప్రసిద్ధి. కథలు, నవలలు, రంగస్థల నాటికలు, కవిత్వాలెన్నో రాసినా.. చాలామందికి ఆయన కథా రచయితగానే పరిచయం. తన రచనలతో పాఠకుల్ని అప్పుడే నవ్వించి.. మరు నిమిషంలోనే ఏడిపించే ఐతా చంద్రయ్య.. ‘పాయమాలు’ కథాసంపుటితో మరోమారు మనముందుకొచ్చారు.
వివిధ దినపత్రికల్లో అచ్చయిన 23 కథలను ‘పాయమాలు’గా తీసుకొచ్చారు. వీటిని చదువుతున్నంతసేపూ.. ఆయా కథల్లో మనల్ని మనం చూసుకుంటాం. వర్తమానంలో జరిగిన వాస్తవాలను కథల రూపంలో అందించి.. ఆయా కష్టాలు మనకే వచ్చాయన్నట్లుగా భావిస్తాం. ఇందులోని సాధనా శూరత్వం, శివతాండవం, నానమ్మ, పేగు బంధం లాంటి కథలు కంటితడి పెట్టిస్తాయి. పాయమాలు, అదా సంగతీ! వంటివి కడుపుబ్బా నవ్విస్తాయి. దుఃఖ భరితమైన కథలకు కూడా సుఖవంతమైన ముగింపు ఇవ్వడంలోనే.. ఐతా చంద్రయ్య రచనా సామర్థ్యం తేటతెల్లమవుతున్నది. ఈ కథలన్నీ కూడా తను పుట్టిపెరిగిన ఊరు (సిద్దిపేట) చుట్టే తిప్పుతూ.. ఆ ప్రాంతాన్ని పాఠకులకు పరిచయం చేశారు రచయిత.
రచయిత: ఐతా చంద్రయ్య
పేజీలు: 130, ధర:రూ.160
ప్రతులకు : 93912 05299 నవోదయ బుక్ హౌస్, కాచిగూడ నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్
…? రాజు పిల్లనగోయిన
సంపాదకులు : వంగూరి చిట్టెన్ రాజు
పేజీలు : 254;
ధర : ఉచితం
ప్రచురణ : వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా.
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 80963 10140
రచన : మయూరి (డా. గడ్డం శ్యామల)
పేజీలు : 76;
ధర : రూ.80
ప్రచురణ : జె.వి. పబ్లికేషన్స్
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 97041 75183