నేనేం కోటీశ్వరురాల్ని కాదు. కానీ, నా పిల్లల్ని ప్రపంచంలోనే అత్యుత్తమ చైల్డ్ కేర్ సెంటర్లో వదిలాను. అమ్మానాన్నలు నాతోనే ఉంటారు.
పదేండ్ల క్రితం అతను రాసిన ప్రేమలేఖకు పూర్వ విద్యార్థుల సమావేశంలో జవాబు ఇచ్చిందామె. భర్తను చూపిస్తూ.. ‘ఈయన మా ఆయన. నా బావ. పుట్టినప్పుడే ఖాయం చేశారు’
‘శవాల్ని చూస్తే భయమేయదా? దెయ్యాలు అవుతాయేమో’ అడిగాడు కాపరిని. ‘చచ్చినోళ్ల కంటే బతికినోళ్లే ప్రమాదం సారూ. వాళ్లంటేనే నాకు భయం’ జవాబిచ్చాడు కాపరి.
‘సారీ.. ఇంకో ఆరు నెలల్లో మీరు మరణిస్తారు’ రిపోర్ట్స్ చూసి చెప్పాడు డాక్టర్. వెంటనే ఆ రోగి ‘ఆరు నెలల్లో ప్రపంచ యాత్ర’
ప్యాకేజీ బుక్ చేసుకున్నాడు.
‘నేను ముద్దు పెట్టుకున్నప్పుడు కళ్లెందుకు మూసుకుంటావ్?’. ‘కళ్లు మూసుకుంటేనే.. మనసు తెరుచుకుంటుంది డియర్’.