రుచికరమైన వంటలను ఆస్వాదించడానికే పరిమితం కాకుండా.. వాటిని వండిన చెఫ్‌లను కలిసి ఆయా వంటల తయారీ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు భోజన
ప్రియులు. అలాంటి వారందరినీ ఒకచోట చేర్చే వేదిక.. ‘ఫుడ్హోస్ట్స్ ( Food Hosts ) ‘. హైదరాబాద్‌కు చెందిన సృజన కనుమూరి ( Srujana Kanumuri ) ప్రారంభించిన ఈ అంకుర సంస్థ రెస్టారెంట్లలో దొరకని అరుదైన రుచులను అందించడంతోపాటు, స్థానిక చెఫ్‌లను నేరుగా కస్టమర్ల ముంగిటికి తీసుకెళ్తున్నది.
స్టార్టప్ ప్రారంభానికి ముందే 100 మందికి పైగా చెఫ్‌లను సంప్రదించి వారిలో 30 మందిని ఎంపిక చేసుకుని.. 2022 ఫిబ్రవరిలో ‘ఫుడ్హోస్ట్స్’ను ప్రారంభించారు. ‘ఆంగ్లో ఇండియన్ చికెన్ రోస్ట్’, ‘చుక్కకూర చికెన్’, ‘కల్లుకోడి కూర-బగారా అన్నం’, ‘వంకాయ మటన్’.. ఇలా ఒక్కో ప్రాంతంలో పేరొందిన భిన్నమైన వంటలను అందిస్తున్నారు సృజన. సంస్థ వెబ్సైట్లో రకరకాల వంటల వివరాలతోపాటు చెఫ్‌ల చిరునామాలూ ఉంటాయి. వంటపై మక్కువ ఉన్న ఎవరైనా ఈ సైట్లో తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఫుడ్హోస్ట్ ప్రతినిధులే ఇంటికొచ్చి కొత్త వంటకాన్ని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటారు.
Read More :
“వీళ్లు వంట చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే !!”
“ఇలా మామిడి పండ్ల రుచిని ఏడాదంతా ఎప్పుడైనా ఆస్వాదించొచ్చు !”