ఫొటోగ్రఫీలో కాంతి (లైట్) అనేది అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సహజ కాంతితోపాటు కృత్రిమ కాంతిని సృజనాత్మకంగా (Creative Lighting) ఉపయోగించడం ద్వారా.. ప్రత్యేకమైన, కళాత్మకమైన ఫొటోలను తీసుకోవచ్చు. దీన్ని సాధించడానికి మీ వద్ద డీఎస్ఎల్ఆర్ ఉండాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ ఒక్కటే చాలు!
ఫొటో గ్రఫీలో లైటింగ్‌ను అర్థం చేసుకోవడం, దానిపై పట్టు సాధించడం చాలా కీలకం. లైటింగ్ నాణ్యత, తీవ్రత, దిశ, కోణం, రంగు, ఉష్ణోగ్రత లాంటివి ఫొటోల్లో క్రియేటివిటీని పెంచుతాయి. ఒక్కో చిత్రానికి ప్రత్యేకమైన ఆకృతిని, డెప్త్‌ను అందిస్తాయి. వీక్షకులపై మానసిక, భావోద్వేగ ప్రభావాలను చూపుతాయి. ఫొటోకు డ్రామా, డెప్త్‌ను అందిస్తాయి. క్రియేటివ్ లైటింగ్ ఫొటోగ్రఫీతో సాధారణ సబ్జెక్ట్‌ను కూడా అసాధారణంగా చూపించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం లైటింగ్‌కు కాస్త సృజనాత్మకత జోడిస్తే.. అద్భుతమైన ఛాయాచిత్రాలు వస్తాయి. కాబట్టి, సహజ కాంతితోపాటు కృత్రిమ కాంతితోనూ ప్రయోగాలు చేసేయండి.
చివరగా.. ఇంట్లోనే రకరకాల ప్రయోగాలు చేయండి. ఒకే సబ్జెక్ట్‌పై వేర్వేరు రకాల లైటింగ్‌ను ప్రయోగించండి. ఏవైనా తప్పులు దొర్లితే.. మళ్లీ ప్రయత్నించండి. పాత తప్పులు పునరావృతం కాకుండా చూసుకోండి. కాంతితో సరికొత్త కథ చెప్పండి. సరళమైన వస్తువులతోనే గొప్ప ఫలితాలు సాధించండి.
మొబైల్ ఫొటోగ్రఫీలో.. మీ ప్రత్యేక శైలిని వెలికితీయండి.
– ఆడెపు హరికృష్ణ