గద్వాల, సెప్టెంబర్ 13 : గద్వాలలో నిర్వహించిన గద్వాల గర్జన సభకు కేటీఆర్ రావడంతో గద్వాల అంత జనసంద్రంగా మారింది. సాయంత్రం నుంచి చిరు జల్లులు పడుతున్నప్పటికీ కేటీఆర్ రాక, ఆయన ప్రసంగం కోసం బీఆర్ఎస్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఆసక్తితో ఎదురు చూశారు. వర్షంలోనూ కేటీఆర్‌కు గద్వాలలో ఇక్కడి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎర్రవల్లి చౌరస్తావద్ద గజమాలతో ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కేటీఆర్ రాకతో గద్వాల జిల్లా కేంద్రంలోని అన్ని రహదారులు ప్రజలతో కిక్కిరిసి పోయాయి. సభ కొంత ఆలస్యమైనా సమావేశానికి వచ్చిన ప్రజలు సభ ముగిసెంతవరకు అక్కడ నుంచి కదలలేదు. సభకు వచ్చిన ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చిన వారే తప్పా వారిని ఎవరు సభకు తరలించలేదు. సభకు హాజరైనా జనాన్ని చూస్తే బీఆర్ఎస్కు మంచి రోజులు ఉన్నాయని సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. కేటీఆర్ మాట్లాడుతున్నంత సేపు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కేసీఆర్‌కు అనుకూంగా నినాదాలు చేశారు.
కేటీఆర్ గత ప్రభుత్వ పాలన ఎలా ఉండేది, ప్రస్తుత పాలన ఎలా ఉండేదని ప్రజలను అడిగితే కేసీఆర్ మమ్మల్ని కండ్లలో పెట్టి చూసుకునే వాడని ప్రజల నుంచి స్పందన, అనుకూల నినాదాలు రావడంతో అందరూ కేసీఆర్‌కు జై అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్ గద్వాలకు చేరుకోగానే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజయ్‌కుమార్ గజమాలతో స్వాగతం పలికారు. కేటీఆర్ ర్యాలీ రాఘవేంద్రకాలనీ నుంచి ప్రారంభం కాగా ర్యాలీని ముందుండి సాట్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాస్ హనుమంతునాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ ర్యాలీని నడిపించారు. ర్యాలీ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులతో రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. అర కిలోమీటర్ పైగా ర్యాలీ మైదానికి చేరుకోవడానికి గంటకు పైగా సమయం పట్టింది.
వర్షంలోనూ కేటీఆర్‌ను చూడడానికి ప్రజలు దారి పొడవునా నిల్చున్నారు. ర్యాలీ రాఘవేంద్రకాలనీ, కిష్టారెడ్డిబంగ్లా, మీదుగా గాంధీచౌక్ నుంచి తేరు మైదానానికి చేరుకుంది. పట్టణం అంతా శనివారం గులాబీ మయంగా మారడంతోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసింది. కార్యకర్తలు అణుఅణువునా బీఆర్ఎస్, కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ స భా ప్రాంగనానికి ర్యాలీగా చేరుకున్నారు. స భ నిర్వహించే తేరు మైదానం జనసంద్రంతో నిండిపోయింది .కళాకారుల ఆట పాట ప్రజలను ఉత్తేజపరిచింది. ర్యాలీ, సభకు వచ్చిన జనాలను చూసి అధికార పార్టీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
మొత్తమ్మీద కేటీఆర్ సభ వర్షంలోనూ విజయవంతం కావడం ప్రజలకు, నాయకులకు, క్యాకర్తలకు ఉన్నా బీఆర్ఎస్పై ఉన్న సంకల్ప బలమే నిదర్శనం. మొత్తం మీద నడిగడ్డపై గులాబీ గర్జన గర్జించి, అధికారపార్టీ నాయకుల గుండెల్లో గుబులు, రైళ్లు పరిగెత్తించేలా చేసింది.
బీఆర్ఎస్లో ఉన్నానన్న బండ్ల బీఆర్ఎస్ మీటింగ్‌లో ఏడీ..?
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పదే పదే బీఆర్ఎస్లో ఉన్నా అని చెబుతున్నా, శనివారం గద్వాల తేరు మైదానంలో నిర్వహించిన గద్వాల గర్జన సభలో ఆయన ఏడీ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మీటింగ్‌కు హాజరైతే గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్లో ఉంటే సమావేశానికి హాజరు కావాలి కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ అంటే గౌరవం అనే వ్యక్తి బీఆర్ఎస్ సభలో ఎందుకు పాల్గొనలేదు. అంటే ఆయన బీఆర్ఎస్లో ఉన్నటా..? లేనట్టా ? బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గద్వాల గర్జనకు హాజరు కాలేదంటే ఆయన పార్టీ మారినట్లే కదా అనే అనుమానాలు బలపడుతున్నాయి.