అమ్మప్రేమకు సలాం!
అమ్మ పాదాల కింద స్వర్గం ఉంటుందంటారు. మనకు జన్మను, జీవితాన్ని, అపారమైన ప్రేమను ఇచ్చిన ఆ తల్లికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అమ్మప్రేమను వ్యక్తపరచడానికి ఎన్ని అక్షరాలైనా సరిపోవు. అమ్మకు మనపై ఉన్న ప్రేమను, అమ్మ మీద మనకున్న ప్రేమను, ఆకలిని తన కడుపులోనే దాచుకొని బిడ్డల కడుపు నింపే అమ్మతనం గురించిన కవితలతో వచ్చిన సంకలనమే ‘అమ్మీజాన్’. ఈ పుస్తకాన్ని అమ్మకు, అమ్మ
ప్రేమకు ఆయా కవులు ఇచ్చిన అక్షరాల నజరానాగా చెప్పొచ్చు. ఇందులోని కవితలు ముస్లిం కుటుంబాల్లోని అమ్మ జీవితాన్ని కళ్లకు కడతాయి. కొన్ని కంట నీరు పెట్టిస్తాయి.
నాన్న ఆధిపత్యం కింద, నాన్నమ్మ పెత్తనం కింద నలిగిపోయిన ఎందరో అమ్మీజాన్లు కన్నీటిని సుర్మా వెనుకాలే దాచిపెట్టిన వైనం ‘అమ్మీజాన్’ కవితల్లో కనిపిస్తుంది. ఒకవైపు పేదరికం, మరోవైపు ఎదురు తిరగలేని నిస్సహాయత మధ్య పిల్లలకు ఏ లోటూ రాకుండా చూసుకునే అమ్మల ఏడుపు బురఖా దాటనివ్వని అమాయకత్వం అగుపిస్తది. అమ్మప్రేమకు అక్షర నీరాజనం అందించేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయం. అమ్మీజాన్ కవితల గుల్దస్తా మీకు తెలియకుండానే కొన్ని కన్నీటిచుక్కలను అమ్మ పాదాలకు అర్పించేలా చేస్తుంది. తల్లి ప్రేమలోని శక్తిని, అందాన్ని, వీరత్వాన్ని ఏ భాష కూడా వ్యక్తపరచలేదు. ఈ కవిత్వం అమ్మను ముద్దాడిన పెదాల లాంటిది. సలాం అమ్మీ జాన్.
అమ్మీజాన్
పేజీలు: 120, ధర: రూ.150
ప్రచురణ: వరంగల్ బుక్ క్లబ్ పబ్లికేషన్స్
ప్రతులకు: ఫోన్: 98660 89066
బూర్గుల రామకృష్ణరావు
రచన: టి. ఉడయవర్లు
పేజీలు: 64,
వెల: రూ. 100
ప్రచురణ: శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం
ప్రతులకు:
ఫోన్: 98856 86415
వెన్నెల కల (జంబూద్వీప తత్త కవిత్వం)
Book
రచన: గుడిపల్లి నిరంజన్
పేజీలు: 151, వెల: రూ. 150
ప్రచురణ: ఫూలే-అంబేడ్కర్ అధ్యయన వేదిక
ప్రతులకు:
ఫోన్: 94933 19878
డ్రైవర్బాబు డాక్టరయ్యాడు (కథల సంపుటి)
Book1
రచన: పొత్తూరి జయలక్ష్మి
పేజీలు: 125, వెల: రూ. 100
ప్రతులకు:
ఫోన్: 94902 33148
– ప్రవీణ్