Bhumi Pednekar | మొదటి సినిమాతోనే ‘ఫిలింఫేర్’ అవార్డు అందుకున్న అందాల భామ భూమి పెడ్నేకర్. సోషల్‌మీడియాలోనూ.. హాట్‌హాట్ ఫొటోషూట్స్‌తో అభిమానులను అలరిస్తున్నదీ బాలీవుడ్ బ్యూటీ. మొదటి సినిమాలో 130 కిలోల బరువుతో భారీగా కనిపించినా.. అతితక్కువ కాలంలోనే మెరుపు తీగలా మారింది. మనసుకు నచ్చిన పని ఎంత కష్టమైంది అయినా ఇష్టంగా చేస్తానంటున్నది భూమి పెడ్నేకర్. ఆ భామ ముచ్చట్లు..
నేను పుట్టి పెరిగింది ముంబైలో. చిన్నప్పటినుంచీ ఆధునికంగా ఉండటం అలవాటైంది. చదువుకునే రోజుల్లోనే మోడలింగ్‌పై దృష్టిపెట్టాను. కాబట్టే, కెమెరాను ఫేస్ చెయ్యడం పెద్ద కష్టంగా అనిపించలేదు. మొదటి సినిమా ‘దమ్ లగా కే హైసా’ కోసం చాలా బరువు పెరిగాను. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. ఆ సినిమా విజయంతో కష్టానికి తగిన ఫలితం దక్కింది. మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం అదృష్టంగా భావిస్తాను.
నాకు ముందు నుంచీ తాత్కాలిక సంబంధాల మీద సదభిప్రాయం లేదు. జీవితంలో నేను చాలామందిని కలిశాను. మనసు విప్పి మాట్లాడాను. ప్రేమ, గౌరవం, నమ్మకం ఉన్నచోటే బంధం దృఢంగా ఉంటుందని నమ్ముతాను. నేనేమిటో నాకు తెలుసు. నేనేంటో తెలియని వాళ్ల గురించి కానీ, నా గురించి తెలిసిన వాళ్ల గురించి కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే రూమర్స్‌ను తేలిగ్గా తీసుకుంటా, నవ్వుకుంటా.
అక్షయ్ కుమార్, తాప్సీ, ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండే, రాజ్‌కుమార్ రావు.. ఇలా నాతో పనిచేసిన ప్రతి ఒక్కరితోనూ నాకు మంచి స్నేహం ఉంది. పనిని ప్రేమించే వ్యక్తులంతా ఒక చోట కూడినప్పుడు తప్పకుండా మంచి స్నేహితులుగా మారతారు.
నా ఒంటికి ఎలాంటి మేకప్ నప్పుతుంది అనే విషయం నాకు బాగా తెలుసు. అందుకే నా మేకప్ నేనే వేసుకుంటాను. బ్యూటీ టీమ్‌కు సలహాలు కూడా ఇస్తుంటాను. ఒత్తిడిని
తగ్గించుకునేందుకు నేను ఎంచుకునే మొదటి మార్గం.. మేకప్ వేసుకోవడమే. చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది.
ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఈ సంవత్సరం స్పెయిన్, దుబాయ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్.. కవర్ చేస్తూ లాంగ్ ట్రిప్ వెళ్లాను. నాకు బాగా నచ్చిన దేశం స్పెయిన్. ఈ ఏడాదంతా వరుస సినిమాలతో బిజీగా గడిచిపోయింది. ‘ద లేడీ కిల్లర్’, ‘రక్షాబంధన్’ తదితర సినిమాల్లో ప్రేక్షకులకు నచ్చే పాత్రలు పోషించాను.
“Bhumi Pednekar | కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతున్న భూమి ఫడ్నేకర్..”