Ghee Coffee Health Benefits| కాఫీ ఒక దోస్త్ లాంటిది. పొద్దున్నే ఓ కప్పు పడితే రిఫ్రెష్ కావచ్చు. కొందరికైతే కాఫీ లేకుండా దినచర్య మొదలు కాదు. కాఫీలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది నిపుణుల మాట. అయితే.. ‘నెయ్యి కాఫీ’తో కొవ్వును అమాంతం తగ్గించుకోవచ్చని నటి భూమి పడ్నేకర్ సలహా ఇస్తున్నది. దీంతో చాలామంది ‘ఘీ కాఫీ’ వైపు మొగ్గు చూపుతున్నారు.
నటి భూమి పడ్నేకర్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్నాప్ని పంచుకున్నది. ‘ఉదయాన్నే ఘీ కాఫీ = ఫ్యాట్ ఫస్ట్’ అనే తన క్యాప్షన్ వైరల్ అయ్యింది. కాఫీ ప్రియులు,
డైటీషియన్లు కూడా నెయ్యి కాఫీ గురించి స్పందిస్తున్నారు. ఇది కీటో కాఫీని గుర్తుచేస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాఫీకి నెయ్యి జోడించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఘీ కాఫీ తాగిన తర్వాత ఏదైనా తిన్నప్పుడు ఇన్సులిన్ నెమ్మదిగా విడుదల అవుతుంది. మధుమేహం, జీవక్రియ సమస్యలు ఉన్నవాళ్లు నెయ్యి కాఫీతో మరింత ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు అంటున్నారు.
కాఫీలో నెయ్యి లేదా వెన్నను జోడించడం వల్ల కెఫిన్ దుష్ప్రభావాలను ఎదుర్కొనే శక్తిని పెంపొందించుకోవచ్చు. కెఫిన్ పడనివారూ ఉంటారు. అలాంటివారికి నెయ్యి కాఫీ అత్యుత్తమం. హార్మోన్ల నియంత్రణలో మహిళలకు ఇది సాయపడుతుంది. సహజంగానే నెయ్యి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శక్తిని పెంచుతుంది. నెయ్యి కాఫీలో కొవ్వు ఉన్నప్పటికీ.. జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా బరువును నియంత్రించే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. బుల్లెట్‌ప్రూఫ్ కాఫీగా పిలిచే నెయ్యి కాఫీని ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది. వ్యాయామానికి ముందు తీసుకుంటే ఇంధనంగా పనిచేస్తుంది. సాయంత్రం ఐదు తర్వాత పుచ్చుకుంటే మాత్రం నిద్రకు ఆటంకం కలిగిస్తుందని అంటున్నారు. కప్పు కాఫీలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్ర దించాకే ఓ నిర్ణయం తీసుకోవడం మంచిది.
Naya Mall | ఈ కప్‌లో కాఫీ పోస్తే ఎంతసేపైనా వేడి వేడిగానే ఉంటుందట!!”