కాఫీని ఎక్కువగా తీసుకోవడం ద్వారా అల్జీమర్స్‌ను ఆమడ దూరం తరిమేయవచ్చట..!
Research on Alzheimers: ఒక కప్పు వేడివేడి కాఫీ లేకుండా రోజును ప్రారంభించలేని వ్యక్తులలో మీరు కూడా ఒకరా..? అయితే, ఇటీవల జరిగిన ఓ అధ్యయనం మీకో శుభవార్త తెలియజేస్తున్నది. ఎక్కువ మొత్తంలో కాఫీ తీసుకోవడంవల్ల

హైదరాబాద్: ఒక కప్పు వేడివేడి కాఫీ లేకుండా రోజును ప్రారంభించలేని వ్యక్తులలో మీరు కూడా ఒకరా..? అయితే, ఇటీవల జరిగిన ఓ అధ్యయనం మీకో శుభవార్త తెలియజేస్తున్నది. ఎక్కువ మొత్తంలో కాఫీ తీసుకోవడంవల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలో తేలింది. ఈ నూతన పరిశోధన ఫలితాలు ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి. మరి ఆ పరిశోధన గురించి సమగ్రంగా తెలుసుకుందామా..?
ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కాఫీ ఎక్కువగా తీసుకోవడం జ్ఞాపకశక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంలో ఒక దశాబ్దకాలంపాటు 200 కంటే ఎక్కువ మందిపై అధ్యయనం చేశారు. తమ పరిశోధనలో కాఫీకి, అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన కొన్ని లక్షణాలకు మధ్య సంబంధం ఉన్నట్లు తేలిందని ఈ రిసెర్చ్‌కు నేతృత్వం వహించిన డాక్టర్ సమంతా గార్డెనర్ చెప్పారు.
ఎక్కువ కాఫీ తీసుకునే అలవాటు ఉండి, జ్ఞాపకశక్తి లోపాలు లేనివాళ్లలో అల్జీమర్స్ ముప్పు చాలా తక్కువగా ఉన్నదని తాజా అధ్యయనంలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. ఎక్కువ కాఫీ తీసుకోవడం అనేది మెదడు పనితీరుకు సంబంధించి సానుకూల ఫలితాలను ఇచ్చింది. ప్రత్యేకించి ప్లానింగ్, స్వీయ నియంత్రణ, ఏకాగ్రతకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ విధుల మెరుగుకు కాఫీ బాగా దోహదపడుతుందని తేలింది.
సాధారణంగా మెదడులో అమైలాయిడ్ ప్రొటీన్ అతిగా పోగుపడటం అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుంది. అయితే, కాఫీ అతిగా తాగేవాళ్ల మెదడులో అమైలాడ్ ప్రోటీన్ నిదానంగా పోగుపడుతుందని పరిశోధనలో తేలింది. డాక్టర్ గార్డెనర్ మాట్లాడుతూ.. దీనిపై మరింత లోతైన పరిశోధన జరుగాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. అల్జీమర్స్ వ్యాధి రాకను కాఫీ ఆలస్యం చేస్తుందనేది మాత్రం తాజా పరిశోధనతో స్పష్టమైందన్నారు. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ మేధో క్షీణత ప్రమాదం పొంచి ఉన్నవారికి ఎక్కువగా కాఫీ తీసుకోవడం బాగా ఉపయోగపడుతుందని గార్డెనర్ చెప్పారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Alzheimers
- Coffee
- Research
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

