బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Sep 27, 2020 , 02:22:46

అతి చిన్న కప్ప..

అతి చిన్న కప్ప..

పిల్లలూ! వానకాలం వస్తే చాలు కప్పలన్నీ  వచ్చి చెరువుల్లో చేరుకుంటాయి కదా! అందులో చినచిన్న కప్పలు కూడా ఉంటాయి.  వాటికంటే కూడా చిన్న కప్పను శాస్త్రజ్ఞులు కనుకొన్నారు. ఇది నాణానికంటే కూడా చిన్నగా ఉంటుంది.  పాపువా న్యూగినియా ఉష్ణమండల దీవిలోని వర్షారణ్యంలో ఈ కప్ప కనిపించింది. సాధారణంగా మనం చూసే  కప్పల కంటే కూడా చాలా చిన్నది.  చేతికి చిక్కనంత చిన్నగా ఉంటుంది. దీని సైజు.. 7.7మిల్లీమీటర్లే. పేరు పెడోప్రైపన్‌ అమాన్యున్సిస్‌. దీని ఆకారం కంటే పేరే పొడవుగా ఉంది కదా! ఇప్పటివరకు 8 మిల్లీమీటర్లు ఉన్న పెడోసైప్రిస్‌ ప్రోజెనెటికా అనే ఇండోనేషియన్‌ చేపను ప్రపంచంలోనే అతి చిన్న వెన్నెముక కలిగిన జీవిగా   భావించారు.   దాన్ని పక్కకు తోసేసి ఈ కప్ప వచ్చి కూర్చుంది. గోధుమరంగు, నీలం, తెలుపు మచ్చలతో ఉండే ఈ కప్పలు బయటి ప్రపంచానికి కనిపించకుండా రెయిన్‌ ఫారెస్ట్‌లో తమ కన్నా చిన్నగా ఉండే పురుగులను తిని జీవిస్తుంటాయి.  సూక్ష్మ శరీరం ఒక విధంగా వీటికి అదృష్టమనే చెప్పవచ్చు.  ఆ చిన్న శరీరాలతో ఇవి శత్రువుల కంటపడకుండా ఎక్కువ కాలం జీవిస్తాయి.


logo