CM KCR | పెద్దలకు కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేయడం వెనుక ఆంతర్యమిదే..
CM KCR | తెలంగాణ నుంచి ఎదిగిన ఒక ప్రసిద్ధ కవి చనిపోయినప్పుడు, ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరపాలని కేసీఆర్ అనుకున్నారు. అంతిమయాత్రకు వెళ్లాలనీ నిర్ణయించుకున్నారు. సహచరుల్లో ఒకరు దీనిపై అభ్యంతరపెట్టారు. ‘ఆ కవి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ప్రత్యేక రాష్ట్ర వాదనకు మద్దతివ్వలేదు. అందువల్ల మనం వెళ్లాల్సిన అవసరం లేదు’ అని ఆయన వాదించారు. కేసీఆర్ దీన్ని ఖండించారు.
అన్నిటినీ ఉద్యమ కోణంలోనే, రాజకీయ దృష్టితోనే చూడాల్సిన అవసరం లేదు. ఎవరు అవునన్నా, కాదన్నా ఆయన తెలంగాణ ముద్దుబిడ్డ. తెలంగాణ ముద్ర. తెలంగాణ విద్వన్మూర్తి. అందువల్ల ఆయనను మనం గౌరవించి తీరాల్సిందే అని హితవు పలికారు. అంత్యక్రియలకు వెళ్లడమే కాదు; స్వయంగా పాడె మోసి తన భక్తి చాటుకున్నారు. రాజకీయ, సైద్ధాంతిక విభేదాలకన్నా, తెలంగాణ భూమిక ఎంతో విశాలమైనదని కేసీఆర్ ఆలోచిస్తారు. పీవీతో పాటు, తన భావజాలంతో విభేదించే అనేకమందిని ఆయన అదే దృష్టితో గౌరవించారు. తెలంగాణ పట్ల ప్రొఫెసర్ జయశంకర్కున్న నిబద్ధతను గుర్తించిన కేసీఆర్, బహిరంగ సభా వేదికపైనే ఆయనకు కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసేవారు. చదువు నేర్పిన గురువుకు, సాధు సంతులకు, తెలంగాణ బిల్లుపై సంతకం చేసిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి కేసీఆర్ నమస్కారం చేయడంలోని అంతరార్థం… వారి విద్వత్తు, నిబద్ధతల పట్ల వినయపూర్వకమైన కృతజ్ఞతే!
తెలంగాణలో అనేక అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి. గడీలు, కోటలు, బురుజులు, చారిత్రక అవశేషాలు అనేకం ఉన్నాయి. రామప్ప చాలా ఉన్నతమైనది. అలంపూర్‌లోని జోగులాంబ ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది.
– కేసీఆర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
KCR Birthday special | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
CM KCR Birthday special | కేసీఆర్ రోజువారీ షెడ్యూల్ ఎలా మొదలవుతుందో తెలుసా !
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
CM KCR | కేసీఆర్ దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే ఏంటి?
CM KCR | భక్తిభావంలో ఆయనకు ఆయనే సాటి.. జిల్లాలు, ప్రాజెక్టులకు దేవతల పేర్లు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

