IAS Shikhar Agrawal: 40 విల్లాలు కొన్న ఐఏఎస్ ఆఫీసర్.. హోల్డ్‌లో శిఖర్ అగర్వాల్ పోస్టింగ్
IAS Shikhar Agrawal: రాజస్థాన్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శిఖర్ అగర్వాల్ ట్రాన్స్ఫర్ను హోల్డ్‌లో పెట్టారు. ఆయన ఫ్యామిలీ ఒకే కంపెనీ నుంచి గడిచిన రెండున్నర ఏండ్లలో 40 విల్లాలు కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
జైపూర్: రాజస్థాన్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శిఖర్ అగర్వాల్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయనతో పాటు ఆయన భార్య, ఐపీఎస్ ఆఫీసర్ ప్రషాకా మాథూర్, ఇద్దరు కుమారులు, పేరెంట్స్ పేరిట 40 విల్లాలను , కాటేజ్‌లను కొనుగోలు చేశారు. గడిచిన రెండున్నర ఏండ్లలో ఒకే కంపెనీ వద్ద ఆ విల్లాలు కొన్నట్లు శిఖర్ అగర్వాల్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ రాష్ట్ర పర్సనల్ డిపార్టమెంట్ బుధవారం రాత్రి కీలక ఆదేశాలు జారీ చేసింది. 1993 ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్ అయిన అగర్వాల్‌ను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వెయిటింగ్ పోస్టింగ్ ఆర్డర్లో పెట్టారు. పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, ప్లానింగ్ శాఖకు గతంలో ఆయన అదనపు చీఫ్ సెక్రటరీగా చేశారు. రాజస్తాన్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా చేశారు. గతంలో సీఎంవోలో కూడా అగర్వాల్ పనిచేశారు. మాజీ చీఫ్ సెక్రటరీ సుధాన్షు పంత్‌తో విబేధాల నేపథ్యంలో ఆయన్ను సీఎంవో నుంచి తప్పించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రేవంత్ రెడ్డి.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి
IAS Shikhar Agrawal: 40 విల్లాలు కొన్న ఐఏఎస్ ఆఫీసర్.. హోల్డ్‌లో శిఖర్ అగర్వాల్ పోస్టింగ్
ప్రజా తిరుగుబాట్లు
Kota Maisamma | పెరిగిన కోట మైసమ్మ జాతర ఆదాయం.. ఎంతంటే?
AadarshaKutumbam Review | ‘ఆదర్శకుటుంబం – హౌస్ నెం. ఏకే 47’ రివ్యూ.. వెంకటేశ్ – త్రివిక్రమ్ సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

