20 years of TRS | CM KCR | కేసీఆర్ ఒకసారి ఒక తండాలో పల్లె నిద్రకు పోయారు. అక్కడ ఆదివాసీ ఇల్లు కాలిపోయింది. బిడ్డ పెండ్లి కోసం ఇంట్లో దాచుకున్న డబ్బులూ కాలిపోయాయి. బిడ్డ పెళ్లెలా చేసేది అని ఆ ఇంటావిడ ఏడుస్తూ కూర్చుంది. ఆ దృశ్యం ఆయన మదిలో ముద్ర వేసింది. ఆ ముద్రే ఆ తర్వాత కల్యాణ లక్ష్మి పథకంగా అవతరించింది.
చదువుకునే రోజుల్లో కేసీఆర్ దుబ్బాకలో ఉండేవారు. ఆ కాలంలో పేద మధ్యతరగతి మహిళలు రోజంతా బీడీలు చుడుతూ, తంబాకు, పొగాకు వాసన పీల్చి అనారోగ్యానికి గురయ్యే వారు. ఆ జ్ఞాపకం నుంచి వచ్చిందే బీడీ కార్మికులకు పెన్షన్. విపరీతమైన కాలుష్యంలో రోడ్లపై విధులు నిర్వహించే ట్రాఫిక్ కానిస్టేబుళ్లను, హోంగార్డులను నిశితంగా గమనించేవారు. ఎండనకా, వాననకా ఇంతసేపు పొల్యూషన్లో గడిపితే వీళ్లకు రోగాలు రావా? అని విస్మయపడేవారు. దాన్నుంచే హోంగార్డుల వేతనాల పెంపు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు రిస్క్ అలవెన్స్ వచ్చాయి.
సిద్దిపేటలో చూసిన నీటి కష్టాల నుంచి కాళేశ్వరం, భగీరథ, కాకతీయ, చిన్ననాటి నుంచీ గమనిస్తున్న దళితుల వెతల నుంచి దళిత బంధు ఆవిర్భవించాయి. ఊర్లలో ఎవరి పంట భూమిలో వారు అంత్యక్రియలు నిర్వహించుకునేవారు. మరి భూమి లేని పేదలు, దళితుల సంగతి? ఈ మథనంలోంచి వచ్చిందే వైకుంఠధామం. ఇలా తన నిశిత పరిశీలనలోంచే కేసీఆర్ వివిధ పథకాలకు రూపుదిద్దారు. ఇలా హామీ ఇవ్వని, అడగని పథకాలు వందకు పైగా ఉంటాయని అంచనా.
సఫాయన్నా నీకు సలాం అన్నా! మన తల్లిదండ్రులకన్నా గొప్పోళ్లు, వాళ్లని గౌరవించాలె. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు శుభ్రం చేసి ఎలా పెంచారో, వీళ్లు కూడా మనం పారేసే చెత్త, చెదారాన్ని తీసేసి, గ్రామాలను, పట్టణాలను శుభ్రంగా ఉంచుతున్నరు. వాళ్లకు దండం పెట్టాలె.
– కేసీఆర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CM KCR | కేసీఆర్ గురించి నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు
20 Years Of TRS | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
20 years of TRS | కేసీఆర్ రోజువారీ షెడ్యూల్ ఎలా మొదలవుతుందో తెలుసా !
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
20 years of TRS | కేసీఆర్ దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే ఏంటి?
trs plenary | భక్తిభావంలో ఆయనకు ఆయనే సాటి.. జిల్లాలు, ప్రాజెక్టులకు దేవతల పేర్లు