20 years of TRS | CM KCR | తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఒకసారి కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. నిరసనగా కేసీఆర్ రాజీవ్ రహదారి దిగ్బంధానికి పిలుపునిచ్చారు. సిద్దిపేట సమీపంలో తాను స్వయంగా రోడ్డుపై బైఠాయించారు. చుట్టుపక్కల మందపల్లి తదితర అనేక గ్రామాల ప్రజలు, మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు.
ఆ సమయంలో పలువురు వృద్ధ మహిళలు, పురుషులు అక్కడికి వచ్చి, పక్కనే కూర్చుని ఆప్యాయంగా కేసీఆర్ భుజంపై చేయి వేసి, “ఇగ అటే పోతవా! కనబడుడే లేదు. ఇటాంకల వచ్చుడే కరువైంది. నువ్వు ఉద్యమం అని తిరుగుతే మరి మా గోసెవలు సూడాలె” అని ఆత్మీయంగా అడుగుతున్నారు. ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు అక్కడికి వచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ ఈ దృశ్యాన్ని చూసి, ‘ఒక రాజకీయ నాయకుడితో ప్రజలు ఇంతగా మమేకవడమా?’ అని ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంత ప్రజలతో తనకున్న అనుబంధం అలాంటిదని కేసీఆర్ ఆయనకు జవాబిచ్చారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో ప్రతి పల్లె ఆయనకు తెలుసు. ఎక్కడికి వెళ్లినా పదిమందిని పేరు పెట్టి పలకరిస్తారు. అద్భుతమైన జ్ఞాపకశక్తి ఆయనది. ఎవరినైనా మనం పరిచయం చేస్తూ, పేరు తప్పు చెప్తే, ‘ఆయన పేరు అదికాదు, ఇది’ అని సరిచేసిన సందర్భాలు లోకల్ ఎమ్మెల్యేలకే అనేకం తారసపడుతుంటాయి. ఆయన అందరి మనిషి. ఆయన మనసు అందరిపైనా ఉంటుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెక్సికో నుంచి చొరబాటుదారులు రాకుండా గోడనే కడుతా అన్నడు. భారత్ కూడా మయన్మార్ వద్ద కడుతాం అంటే మేం సపోర్టు చేయడానికి సిద్ధం. ఇంకేదన్న బోర్డర్లో కడుతామంటే వద్దనం. బార్డర్లో సైనికులు కాపలా కాస్తేనే కదా మనం శాంతియుతంగా ఉంటున్నం. ఇంటికాడ ప్రశాంతంగా పడుకుంటున్నామంటే ఆర్మీ పుణ్యం, త్యాగమే కదా.
– కేసీఆర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
trs plenary | కేసీఆర్ గురించి నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు
20 Years Of TRS | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
20 years of TRS | కేసీఆర్ రోజువారీ షెడ్యూల్ ఎలా మొదలవుతుందో తెలుసా !
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
20 years of TRS | కేసీఆర్ దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే ఏంటి?
trs plenary | భక్తిభావంలో ఆయనకు ఆయనే సాటి.. జిల్లాలు, ప్రాజెక్టులకు దేవతల పేర్లు