రోరీ వాన్ ఉల్ట్… అనే చిన్నారి పెద్ద సాహసం చేసింది. దీంతో తనను
‘చిన్నారి బహుబలి’గా పిలుస్తున్నారు. రోరీ వెయిట్ లిఫ్టింగ్‌లో వయసుకు మించిన
బరువును ఎత్తింది. ఆ లెక్కలన్నీ తెలిస్తే మీరూ నోరెళ్లబెడతారు.
రోరీ అమెరికాకు చెందిన బాలిక. వయస్సు ఏడేండ్లు. ఎత్తు నాలుగడుగులు. ఇటీవల 30 కిలోల విభాగంలో యూఎస్ అండర్-11, అండర్-13 టైటిళ్లు అందుకొని ‘అత్యంత పిన్న వయస్సు కలిగిన అమెరికా యూత్ నేషనల్ చాంపియన్’గా రికార్డు సృష్టించింది. ఆ ఉత్సాహంతో ఏకంగా 80 కిలోల బరువును ఎత్తి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. ఆ బరువును జిమ్నాస్టిక్స్‌లో ఇప్పటివరకూ 24 ఏండ్ల లోపు వారెవరూ మోయలేదు. తాజాగా, 2020లో జరిగిన పోటీల్లో 80 కిలోలు ఎత్తి చరిత్రను సృష్టించింది. రోరే తండ్రి కావన్ వాన్ ఉల్ట్, తల్లి లిండ్సేలకు రోజూ వ్యాయామశాలకు వెళ్లటం ఇష్టం. దీంతో చిన్నప్పుడే రోరీకి జిమ్ అలవాటైంది. అప్పుడే తల్లిదండ్రులు పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సాషా కార్సెన్ను సంప్రదించారు. రోరీ శరీర నిర్మాణాన్ని ఆయన బాగా పరిశీలించారు. మనసుకు ఒత్తిడి లేకుండా వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే ఆ చిన్నారి సాధన జరగాలని ఆమె సూచించారు. రోరీ ఐదేళ్ల వయసులో శిక్షణ కేంద్రంలో చేరింది. ప్రత్యేక శిక్షణ తర్వాత అధికారులు ఆ చిన్నారిని పోటీలకు అనుమతించారు. ఐదేండ్ల వయస్సులో ‘యుఎస్ నేషనల్ యూత్ చాంపియన్‌షిప్’ కోసం అండర్-13 బాలికల విభాగంలో తను పోటీ పడింది. 10 కిలోల బరువు ఎత్తి అందరినీ అబ్బుర పరిచింది. 2019లో వరుసగా 32 కిలోలు, 42 కిలోలు ఎత్తింది. అలా, అతి చిన్న వయసులో ’యుఎస్ యువ జాతీయ చాంపియన్’గా రోరీ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు 80 కేజీల బరువును అవలీలగా ఎత్తి, కొత్త రికార్డును సృష్టించింది.
ఇవీ కూడా చదవండి…