పూల మొక్కలు పెరట్లో పెంచుకుంటే ఇల్లంతా నందనవనంలా కనిపిస్తుంది. పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారిపోతాయి. పచ్చదనం ఒత్తిడిని దూరం చేసి మనసుకు ప్రశాంతతని కలిగిస్తుంది. అందుకే నగరాలు, పట్టణాల్లో చాలామంది స్థలం లేకపోయినా టెర్రస్, బాల్కనీల్లో కుండీల్లో రకరకాల మొక్కలను పెంచుకుంటున్నారు. ఆన్లైన్లో కొంటున్నవారిలో ఎనభైశాతం మంది ఈ మొక్కలనే ఎంచుకుంటున్నారట..
అచ్చంగా పామ్ చెట్లను పోలినట్లుండే ఈ మొక్కలను ఎక్కువగా హోటళ్లు, ఆఫీసుల కారిడార్లలో చూడవచ్చు. ఇవి ముదురు రంగులో పెద్దపెద్ద ఆకులతో కంటికి ఇంపుగా కనపడతాయి. చిన్నకుండీల్లో బాల్కనీల్లోనూ వీటిని పెంచుకోవచ్చు. కాస్త సూర్యకిరణాలు పడే చోటైతే మంచిది.
పర్పుల్ కలర్లో కంటికి ఇంపుగా కనిపించే పూల మొక్క లావెండర్. చాలా అరుదుగా కనిపించే ఈ మొక్క ఖరీదు కూడా చాలా ఎక్కువే. ఇది వెదజల్లే సువాసనలు మనలోని మానసిక ఆందోళనల్ని దూరం చేసి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి.
ఎర్రెర్రని జెరానియం పూల మొక్కను చూస్తే మనసు ఆహ్లాదంతో నిండిపోవడమే కాదు.. దాని నుంచి వెలువడే సువాసనను పీల్చడం వల్ల మనసులోని ఒత్తిళ్లన్నీ హుష్‌కాకి అయిపోతాయంటే నమ్మండి.
అలంకరణల్లో ఈ మొక్కది ప్రత్యేక స్థానం. ఎక్కువగా ఆఫీస్ టేబుల్స్ మీద చూడవచ్చు. దీన్ని లక్కీ బ్యాంబు అని కూడా పిలుస్తారు. బ్యాంబు జాతికి చెందిన ఈ మొక్క ఈనెలు, ఆకులు అచ్చంగా వెదురుని పోలి ఉంటాయి. ముదురు పచ్చదనంతో ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. చిన్నపాటి కుండీలోగానీ, గాజు గ్లాసుల్లోనూ పెంచుకోవచ్చు. మట్టిలేకుండా కేవలం నీళ్ళల్లోనూ దీన్ని పెంచుకోవచ్చు. పెద్దగా సంరక్షణ అవసరం లేదని చెబుతారు ఉద్యాన నిపుణులు.
అలంకరణ మొక్కలలో కలర్‌ఫుల్ క్యాలెండులా ఒకటి. దీన్ని కుండ బంతి, ముద్దబంతి అని పిలుస్తారు. ఈ మొక్కలకు బంతిలాంటి పూలు పూస్తాయి. ఏడాదిలో ఒకసారి మాత్రమే పూలు పూసే ఈ మొక్క పెంపకం సులభం. అందుకే టెర్రస్ గార్డెన్లలో దీని ప్రాధాన్యం ఎక్కువ. క్యాలెండులాను చర్మసంరక్షణ ఉత్పత్తులలో కూడా విరివిగా ఉపయోగిస్తుంటారు.
ఇంటీరియర్ డిజైనింగ్‌లో భాగంగా ఉపయోగిస్తుంటారు. ఇంటి అందాన్ని రెట్టింపు చేసే ఈ మొక్క మానసిక సమస్యల్ని కూడా దూరం చేసి సానుకూల దృక్పథాన్ని పెంచుతుందట. దీన్నుంచి వెలువడే సువాసనకు ఆ శక్తి ఉందట. అంతేకాదు, రోజ్మేరీ నూనెను సౌందర్యసాధనాల తయారీలో, వంటకాల్లో వాడతారు. ఇటు ఆరోగ్యాన్నీ, అటు అందాన్ని కూడా పెంపొందిస్తుందీ మొక్క.