ఆరోగ్యానికి సంబంధించిన హెల్దీ డ్రింక్స్‌ను మిక్స్ చేసుకోవడానికి.. ‘బ్లెండర్స్’ ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక రకాల బ్లెండర్లు పెద్ద సైజులో ఉంటున్నాయి. దాంతో జిమ్‌లో ఉన్నప్పుడు, పార్క్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు తాజా హెల్త్ డ్రింక్ తాగే అవకాశం ఉండటం లేదు. ఈ సమస్యకు ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘నింజా’ పరిష్కారం చూపింది. ‘నింజా బ్లాస్ట్’ పేరుతో పోర్టబుల్ బ్లెండర్‌ను ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చింది. వాటర్ బాటిల్‌ను పోలినట్టు ఉండే ఈ బ్లెండర్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. మీరు ఎక్కడ ఉంటే అక్కడే.. తాజా ప్రొటీన్ షేక్స్, స్మూతీలు, ఫ్రోజెన్ డ్రింక్స్ చేసుకొని తాగొచ్చు. సూపర్ స్పీడ్ మోటర్, స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్లు, అర లీటర్ కెపాసిటీ జార్.. ఈ బ్లెండర్ ప్రత్యేకతలు. సింగిల్ బటన్ ఆపరేషన్‌తో వస్తున్న ఈ బ్లెండర్‌ను వాడటం ఎంతో సులభం. ఆహార పదార్థాలను ఇందులో వేసేసి ఒక్క బటన్ నొక్కితే చాలు.. మీకు కావాల్సిన పండ్ల రసాలను మీ ముందు ఉంచుతుంది. వివిధ రంగుల్లో లభ్యమవుతున్న
‘నింజా బ్లాస్ట్’ వెల రూ. 5,200 ninjakitchen.comతోపాటు అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది.