జీవితంలో ఎదురైన సంఘటనలే శుభ షరాఫ్ ఆలోచనకు ముడిసరుకు. చిన్న వయసులోనే ఆమె దీర్ఘకాలిక వ్యాధుల బారినపడ్డారు. దానికి కారణం అనారోగ్యకరమైన ఆహార విధానమేనని అర్థమైపోయింది. ఆమె భర్త హర్షవర్ధన్ కూడా దాదాపు అలాంటి సమస్యతోనే ఇబ్బంది పడ్డారు.
జీవితంలో ఎదురైన సంఘటనలే శుభ షరాఫ్ ఆలోచనకు ముడిసరుకు. చిన్న వయసులోనే ఆమె దీర్ఘకాలిక వ్యాధుల బారినపడ్డారు. దానికి కారణం అనారోగ్యకరమైన ఆహార విధానమేనని అర్థమైపోయింది. ఆమె భర్త హర్షవర్ధన్ కూడా దాదాపు అలాంటి సమస్యతోనే ఇబ్బంది పడ్డారు. ఎన్ని ఇంగ్లిష్ ఔషధాలు వాడినా తాత్కాలిక ఉపశమనమే తప్పించి.. రుగ్మత నుంచి శాశ్వత విముక్తి లభించదని తేలిపోయింది. ‘జీవన శైలిని మార్చుకోండి. మీ శరీర వ్యవస్థ దానంతట అదే మారిపోతుంది. రోగాన్ని అదే తరిమికొడుతుంది’ అని ఎవరో సలహా ఇచ్చారు.
‘మనిషి స్వతహాగా సాత్వికుడు. సాత్వికాహారమే అతనికి సరైన భోజనం. సాత్విక జీవనశైలినే ఎంచుకోవాలి. ఆ విషయం తెలియక తామస గుణాన్ని పెంచే ఆహారం తీసుకుంటున్నాం’ అంటారు శుభ. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి ‘సాత్విక్ మూమెంట్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఆరంభించారు. నవతరానికి అర్థమయ్యేలా గ్రాఫిక్స్, ఫ్లో చార్ట్స్, కొటేషన్స్ సృష్టించారు. కర్రకారును కంఫర్ట్జోన్ నుంచి బయటికి తీసుకురావడానికి ‘సాత్విక్ చాలెంజ్’ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది శుభ షరాఫ్ ఉద్యమంలో భాగం అయ్యారు. సాత్విక్ మూమెంట్ ముంబైలో మొదలై క్యాలిఫోర్నియా వరకూ విస్తరించింది.