Inspiration | రుచిర కంబోజ్… ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరఫున శాశ్వత ప్రతినిధి. ఆ హోదాను అందుకున్న తొలి మహిళ కూడా. రుచిర ఉద్యోగ పర్వాన్ని గమనిస్తే, ఇదేమీ ఆశ్చర్యంగానో, అసాధ్యంగానో అనిపించదు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్గా రుచిర తన ప్రస్థానాన్ని ఫ్యాషన్ నగరం ప్యారిస్ నుంచి మొదలుపెట్టారు. విదేశాంగ శాఖ కార్యదర్శిగానే కాదు.. ఐక్యరాజ్య సమితిలో వివిధ హోదాల్లో పనిచేశారు.
యునెస్కోలో భారత ప్రతినిధిగా మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల ప్రపంచానికి అవగాహన కలిగించారు. ‘నాకు అప్పగించిన ప్రతి బాధ్యతా భిన్నమైందే. ప్రతిచోటా సవాళ్లు ఉంటాయి. కష్టపడే తత్వమే ఎలాంటి సమస్యనైనా అధిగమించేలా చేస్తుంది’ అంటారు రుచిర. సాధారణంగా ఉత్తమ ర్యాంకర్లు ఐఏఎస్నే ఎంచుకుంటారు. తను మాత్రం, బ్యాచ్ టాపర్ అయినా సరే పట్టుబట్టి ఐఎఫ్ఎస్లోకి వచ్చారు. ఐరాస శాశ్వత ప్రతినిధిగా అరుదైన స్థానానికి చేరుకున్నారు. రుచిర లక్నోలో పుట్టి పెరిగారు. భర్తపేరు దివాకర్ కంబోజ్. పేరున్న వ్యాపారవేత్త.